ముఖ్య సమాచారం
-
ఇరాన్‌పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్‌కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్‌కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్‌లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
పుట్టగుంట వద్ద బుడమేరు వంతెన పై నుండి నీటి ప్రవాహం : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచన
Updated on: 2024-09-01 10:01:00

గుడివాడ డివిజన్లోని బుడమేరు- పుట్టగుంట రహదారులు భవనాల వంతెనపై వరద ప్రవాహం కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు ఎవరూ కూడా రాకపోకలు సాగించక సహకరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ సెల్ ఫోన్ ద్వారా వరద ప్రవాహం- తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలువురు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఆ వంతెనతో పాటు మరో 8 చోట్ల కూడా బుడమేరుకు ఇరువైపుల ఏర్పాటుచేసిన పోలీసులు రెవెన్యూ సిబ్బంది ప్రజలు ఎవరూ కూడా వంతెనపై బుడమేరు దాటకుండా చూడాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుడమేరు లో వరద ప్రవాహం పెరిగి ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు.