ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్‌లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్‌లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్‌లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
హైదరాబాద్‌లో చికెన్‌ఫాక్స్ కేసులు
Updated on: 2025-04-11 07:30:00

ఆటలమ్మ లేదంటే అమ్మవారు పోశారు అనే చెప్పుకునే వ్యాధి కేసులు పెరుగుతున్నాయి. ఎక్కువగా 8 ఏళ్ల లోపు పిల్లలకు ఈ వ్యాధి వస్తోంది. గత కొన్ని రోజులుగా నిలోఫర్ హాస్పిటల్లో నిత్యం 10 నంచి 15 మంది చికిత్స కోసం వస్తున్నారు
చికెన్‌పాక్స్ అనేది వెరిసెలా జోస్టర్ వైరస్ (Varicella Zoster Virus) కారణంగా వచ్చే అంటువ్యాధి. ఇది ముఖ్యంగా చిన్నపిల్లల్లో కనిపిస్తుంది కానీ పెద్దవారికీ రావచ్చు. శరీరంపై చిన్న చిన్న ముడతలు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి.వెరిసెలా జోస్టర్ వైరస్ వల్ల చుట్టుపక్కల వారికి వ్యాపిస్తుంది.
ఒకరితో ఒకరికి సంక్రమణ అంటే జలుబు, దగ్గు, చర్మ స్పర్శ ద్వారా చాలా సులభంగా వ్యాపిస్తుంది. వ్యాక్సిన్ తీసుకోనివారిలో అంటే చిన్నపిల్లల్లో వ్యాక్సిన్ తీసుకోకపోతే ఎక్కువగా వస్తుంది. దగ్గరగా ఉండే వ్యక్తులతో ఎక్కువ సంబంధం ఉన్నవారు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతారు.