ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్‌లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్‌లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్‌లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
వాలంటీర్ల వల్లే ఓడిపోయాం ఏపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్
Updated on: 2025-05-07 06:55:00

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఓటమికి వాలంటీర్లు కారణమంటూ ఏపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే వాలంటీర్లపై చాలాసార్లు స్పందించిన గుడివాడ అమర్నాథ్ మరోసారి... అవే వ్యాఖ్యలు చేశారు.
వైసిపి పార్టీ హయాంలో ప్రజలకు వాలంటీర్లు అలాగే సచివాలయ సిబ్బంది ద్వారా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని గుర్తు చేశారు గుడివాడ అమర్నాథ్. అయినప్పటికీ ఎన్నికలలో వాలంటీర్ల వల్ల ఓడిపోయామని బాంబు పేల్చారు మాజీ మంత్రిగుడివాడ అమర్నాథ్. ఎన్నికల సమయంలో వాలంటీర్లు రాజీనామా చేస్తే అధికారంలోకి వచ్చాక తిరిగి తీసుకుంటామని చెప్పినా కూడా చాలామంది ముందుకు రాలేదని వివరించారు. మొత్తానికి వాలంటీర్ వ్యవస్థ వల్ల అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. వాలంటీర్లు ఉండటం వల్ల... ప్రజా ప్రతినిధులు అలాగే ప్రజల మధ్య బంధం తెగిపోయింది అని కూడా క్లారిటీ ఇచ్చారు మాజీ మంత్రిగుడివాడ అమర్నాథ్.