ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్‌లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్‌లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్‌లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్
Updated on: 2025-05-10 08:06:00

రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లా కోర్టులలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లా కోర్టులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన కార్యాలయ సిబ్బంది ఖాళీల భర్తీకి ఏపీ హైకోర్టు ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం 10 రకాల నోటిఫికేషన్ల ద్వారా 1620 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అయితే వీటిలో ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఫీల్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, స్టెనోగ్రాఫర్ ఖాళీలు అత్యధికంగా ఉన్నాయి. పోస్టును బట్టి రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారని నోటిఫికేషన్లో పేర్కొంది. ఇకపోతే ఏపీ రాష్ట్రవ్యాప్తంగా పోస్టుల ఖాళీలకు సంబంధించి హైకోర్టు వేర్వేరు ప్రకటనలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న నోటిఫికేషన్ ప్రకారం విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలి అని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఖాళీల వివరాలు:పోస్టులు స్టెనోగ్రాఫర్ గ్రేడ్: 380 జూనియర్ అసిస్టెంట్: 230 టైపిస్ట్: 162 ఫీల్డ్ అసిస్టెంట్: 56 ఎగ్జామినర్: 32 కాపిస్ట్: 193 రికార్డ్ అసిస్టెంట్: 24 డ్రైవర్ (లైట్ వెహికల్): 28 ప్రాసెస్ సర్వర్ : 164 ఆఫీస్ సబార్డినేట్: 651 మొత్తం ఖాళీల సంఖ్య: 1620అర్హతలు: 10 విభాగాలకు సంబంధించిన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆయా పోస్టును అనుసరించి ఏడోతరగతి, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు, టైప్ రైటింగ్/ స్టెనో సర్టిఫికెట్, కంప్యూటర్ పరిజ్ఞానం, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వయో పరిమితి: 01/07/2025 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారై ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. జీతభత్యాలు: ఆయా పోస్టులత ఖాళీలను అనుసరించి రూ.20,000 నుంచి రూ.1,24,380 మధ్య జీతం ఉంటుంది. దరఖాస్తు రుసుం : జనరల్ ఇతరులకు రూ.800.. ఎస్సీ, దివ్యాంగులకు రూ.400.
ఎంపిక విధానం:.../ ఆయా పోస్టులను బట్టి రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు అని ప్రకటనలో పేర్కొనడం జరిగింది. దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు తేదీలు:13.05.2025 నుంచి 02-06-2025 వరకు.సంప్రదించాల్సిన వెబ్ సైట్https://districts.ecourts.gov.in/andhrapradeshఅయితే ఆసక్తి కలిగిన అభ్యర్థులు పైన సూచించిన వెబ్ సైట్‌పై క్లిక్ చేసి మరింత సమాచారాన్ని తెలుసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.