ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్‌లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్‌లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్‌లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
కావేరీ నదిలో శవమై తేలిన పద్మశ్రీ అవార్డు గ్రహీత
Updated on: 2025-05-12 07:15:00

భారత వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) మాజీ డైరెక్టర్ జనరల్, పద్మశ్రీ అవార్డు గ్రహీత సుబ్బన్న అయ్యప్పన్ (70) కావేరి నదిలో శవమై కనిపించారు. శ్రీరంగపట్నం సమీపంలోని కావేరీ నదిలో శనివారం తేలుతున్న అతని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని ఆయన మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అయ్యప్పన్ వ్యవసాయం, మత్స్య (ఆక్వాకల్చర్) శాస్త్రవేత్త. ICARలో మొదటి పంటయేతర శాస్త్రవేత్త. అయ్యప్పన్ మైసూరులోని విశ్వేశ్వర నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో నివాసం ఉంటున్నారు. మే 7 నుంచి కనిపించడంలేదనీ ఆయన కుటుంబ సభ్యులు మైసూరులోని విద్యారణ్యపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్రీరంగపట్నంలోని కావేరి నది ఒడ్డున ఉన్న సాయిబాబా ఆశ్రమంలో అయ్యప్పన్ తరచుగా ధ్యానం చేసేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
భారత్‌లో ‘నీలి విప్లవం’లో కీలక పాత్ర పోషించిన అయ్యప్పన్ ఉన్నట్లుండి నదిలో శవమై తేలడం చర్చణీయాంశంగా మారింది. కాగా ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.నది ఒడ్డున సుబ్బన్న అయ్యప్పన్ బైక్ కనిపించిందని, ఆయన నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే దర్యాప్తు అనంతరం మాత్రమే నిర్ధారణకు రాగలమని పోలీసులు తెలిపారు