ముఖ్య సమాచారం
-
అనంత మాజీ ఎంపీ దరూరు పుల్లయ్య కన్నుమూత
-
తగ్గిన బంగారం ధరలు
-
32 ఎయిర్‌పోర్టుల నుంచి రాకపోకలు ప్రారంభం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్‌లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్‌లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
బాదుడే బాదుడు... 6.4 ఓవర్లలోనే 100 కొట్టిన సన్ రైజర్స్
Updated on: 2025-03-23 18:09:00

ఇవాళ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ఎస్ఆర్ హెచ్ జట్టుకు అదరిపోయే ఆరంభం లభించింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ జోడీ తొలి వికెట్ కు కేవలం 3.1 ఓవర్లలోనే 45 పరుగులు జోడించి ఫ్లయింగ్ స్టార్ట్ అందించింది. 11 బంతుల్లో 5 ఫోర్లతో చకచకా 24 పరుగులు చేసిన అభిషేక్ శర్మ... స్పిన్నర్ మహీశ్ తీక్షణ బౌలింగ్ లో అవుటయ్యాడు. ఆ తర్వాత హెడ్ కు మరో చిచ్చరపిడుగు ఇషాన్ కిషన్ తోడయ్యాడు. ఈ జోడీ రాజస్థాన్ బౌలింగ్ ను చీల్చిచెండాడంతో సన్ రైజర్స్ 6.4 ఓవర్లలోనే 101 పరుగులు చేసింది. జోఫ్రా ఆర్చర్ 1 ఓవర్ వేసి 23 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ ఓవర్లో ట్రావిస్ హెడ్ అవుటాఫ్ ద పార్క్ రేంజిలో కొట్టిన భారీ సిక్సర్ హైలైట్ గా నిలిచింది.