ముఖ్య సమాచారం
-
శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. 4 గురు కూలీలు మృతి
-
ప్రయాణికులకు అలర్ట్.. ఆరు ప్రధాన నగరాలకు విమానాలు రద్దు..!
-
10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్న జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం పానాసోనిక్!
-
ఆంధ్రప్రదేశ్ హై కోర్టు(APHC)లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
-
ఈనెల 17న ఐపీఎల్-2025 పునఃప్రారంభం
-
సజ్జల శ్రీధర్‌రెడ్డిని కస్టడీకి ఇవ్వండి : సిట్
-
అనంత మాజీ ఎంపీ దరూరు పుల్లయ్య కన్నుమూత
-
తగ్గిన బంగారం ధరలు
-
32 ఎయిర్‌పోర్టుల నుంచి రాకపోకలు ప్రారంభం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్‌లైన్ సంప్రదింపులు
అనంత మాజీ ఎంపీ దరూరు పుల్లయ్య కన్నుమూత
Updated on: 2025-05-13 06:50:00

అనంతపురం మాజీ లోక్‌సభ సభ్యుడు దరూరు పుల్లయ్య (93) సోమవారం గుండెపోటుతో కన్నుమూశారు. బళ్లారి నగరంలోని దరూరు పుల్లయ్య కాంపౌండ్‌లో ఆయన నివాసం ఉంటున్నారు. సోమవారం బళ్లారి నుంచి కంప్లి కొట్టాల వద్దనున్న పొలాన్ని చూడటానికి కారులో వెళ్లారు. పొలం చూసి ఇంటికి వస్తుండగా కంప్లిలో రోడ్డు పక్కన ఉన్న స్నేహితుడితో మాట్లాడేందుకు కారు దిగారు. అక్కడే కుప్పకూలిపోయి మరణించారు. ఆయన మృతదేహాన్ని బళ్లారిలోని ఇంటికి తరలించారు. దరూరు పుల్లయ్య సొంతూరు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఛాయాపురం. మద్రా్‌సలో లా పూర్తి చేసిన ఆయన... ఉరవకొండ పంచాయతీ సమితి ప్రెసిడెంటుగా 1968 నుంచి 78 వరకూ చేశారు. రెండు దఫాలు... 1977, 1980 ఎన్నికల్లో పుల్లయ్య అనంతపురం ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు