ముఖ్య సమాచారం
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
-
మద్యం కుంభకోణంలో ఎవరినీ వదిలిపెట్టం
-
కావేరీ నదిలో శవమై తేలిన పద్మశ్రీ అవార్డు గ్రహీత
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 13మంది మృతి
పీఓకేలో భారీ పేలుళ్లు, పాకిస్థాన్లోని పలు నగరాల్లోనూ డ్రోన్లు, పేలుళ్లు?
Updated on: 2025-05-11 06:59:00

భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని, సైనిక చర్యలను నిలిపివేయాలన్న అవగాహనను పాకిస్థాన్ ఉల్లంఘించి డ్రోన్లను పంపడంతో భారత్ తీవ్రంగా స్పందించింది. పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు ప్రతిగా భారత బలగాలు దీటుగా బదులిచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) సహా పాకిస్థాన్లోని పలు నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అంతేకాకుండా, పాకిస్థాన్లోని పలు నగరాల్లో కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. పాకిస్థాన్లోని పెషావర్ విమానాశ్రయం వద్ద కూడా డ్రోన్లు కనిపించాయని, వాటిపై కాల్పులు జరుపుతున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. విమానాశ్రయ సమీపంలో పేలుళ్ల శబ్దాలు కూడా వినిపించినట్లు స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి.