ముఖ్య సమాచారం
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
-
మద్యం కుంభకోణంలో ఎవరినీ వదిలిపెట్టం
-
కావేరీ నదిలో శవమై తేలిన పద్మశ్రీ అవార్డు గ్రహీత
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 13మంది మృతి
మురళీ నాయక్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం
Updated on: 2025-05-11 19:23:00

సత్యసాయి జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహం ఏర్పాటు
300 గజాల ఇంటి స్థలంతో పాటు మురళీ నాయక్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం
గోరంట్ల : సరిహద్దులో పాక్ సైన్యంతో పోరాడుతూ ప్రాణ త్యాగం చేసిన శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండాకు చెందిన జవాను మురళీ నాయక్ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం భారీ ఆర్థికసాయం ప్రకటించింది.
ఏపీ ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మురళీ నాయక్ స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు.
అమరుడైన జవాను మురళీ నాయక్ కుటుంబానికి ఐదెకరాలు భూమి ఇస్తామని ప్రకటించారు. 300 గజాల ఇంటి స్థలంతో పాటు మురళీ నాయక్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. మురళీనాయక్ కుటుంబానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ.25 లక్షల వ్యక్తిగత సాయం చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కష్టకాలంలో మురళీనాయక్ కుటుంబానికి దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు. మురళీనాయక్ స్వగ్రామం వెళ్లిన పవన్ కళ్యాణ్ మురళీనాయక్ తల్లిదండ్రులను పరామర్శించారు. మురళీనాయక్ భౌతికకాయానికి నివాళి అర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి ఏ సాయం కావాలన్నా చేసేందుకు కూటమి సర్కార్ సిద్ధంగా ఉందన్నారు.