ముఖ్య సమాచారం
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్‌లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
-
ఏపీ ఎడ్‌సెట్.. రేపే లాస్ట్ డేట్
-
శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. 4 గురు కూలీలు మృతి
-
ప్రయాణికులకు అలర్ట్.. ఆరు ప్రధాన నగరాలకు విమానాలు రద్దు..!
-
10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్న జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం పానాసోనిక్!
-
ఆంధ్రప్రదేశ్ హై కోర్టు(APHC)లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
-
ఈనెల 17న ఐపీఎల్-2025 పునఃప్రారంభం
-
సజ్జల శ్రీధర్‌రెడ్డిని కస్టడీకి ఇవ్వండి : సిట్
శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. 4 గురు కూలీలు మృతి
Updated on: 2025-05-13 10:58:00

వినుకొండ: గుంటూరు- కర్నూలు జాతీయ రహదారి వినుకొండ మండలం శివాపురం గ్రామం వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంబంధించి నలుగురు మహిళ కూలీలు, డ్రైవర్ మృతి చెందారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గడ్డమీద పల్లి గ్రామాన్ని చెందిన నలుగురు మహిళా కూలీలు నరసరావుపేట వద్ద బొప్పాయి కోతకు బొలెరో పార్సిల్ వాహనంలో వెళుతుండగా శివాపురం వద్ద ఎదురుగా వస్తున్న కొబ్బరికాయల లోడ్ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో మరో ఇద్దరు మహిళ కూలీలను, బొలెరో వాహనం డ్రైవర్‌ను వినుకొండ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.