ముఖ్య సమాచారం
-
కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు! హరీష్ రావు, ఈటలకు కూడా..
-
బలూచిస్థాన్‌ను పాకిస్థాన్ దోచుకుంటోంది: అసోం సీఎం సంచలన వ్యాఖ్యలు
-
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
విశాఖ డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన గోవిందరెడ్డికి పవన్ కల్యాణ్ అభినందనలు
-
త్వరలో BLO(బూత్ లెవెల్ ఆఫీసర్)లకు గుర్తింపు కార్డులు: ఎన్నికల కమీషన్
-
విజయవాడ-బెంగళూరు మధ్య వందే భారత్.. ఏకంగా 9 గంటల్లోనే..
-
ఏపీ లిక్కర్ కేసులో ఏడుగురు నిందితుల రిమాండ్ పొడిగింపు.
-
నేడు ప్రకాశం పంతులుగారి వర్ధంతి
-
తెలంగాణ రాజ్ భవన్లో చోరీ
-
బెంగళూరు నగరంలో ఈ సీజన్లోనే అతిపెద్ద వర్షపాతం నమోదు
ఆంధ్రా ప్రదేశ్ లో విషాదం..డీజే సౌండ్‌కు ఆగిపోయిన గుండె.
Updated on: 2025-05-19 19:20:00

పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం బాసూరు గ్రామంలో ఓ పెళ్లివేడుకలో విషాదం నెలకొంది. పెళ్లి ఊరేగింపులో స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తుండగా హార్ట్ స్ట్రోక్ రావడంతో సుంకరి బంగారు నాయుడు అనే 38 ఏళ్ల వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. నిన్న తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మృతుడు బంగారు నాయుడు పెయింటింగ్ మేస్త్రిగా జీవనం కొనసాగిస్తూ విద్యాకమిటి చైర్మన్‌గా, గ్రామ యువజన సంఘం అధ్యక్షుడిగాను కొనసాగుతున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పక్కింట్లో బందువుల కుర్రాడి పెళ్లికి అంతా తానై నిలిచాడు బంగారు నాయుడు. గురువారం తెల్లవారు జామున దగ్గరుండి డిజె సౌండ్ల మధ్య ఊరేగింపును నిర్వహించాడు. ఊరేగింపు చివరికి వచ్చిన సమయంలో సరదాగా స్నేహితులతో కలిసి తానూ స్టెప్పులేసాడు. అలా స్టెప్పులు వేస్తుండగానే గ్రామస్తుల కళ్లముందు కుప్పకూలిపోయాడు. మొదట తూలి పడిపోయాడని అతనితో కలిసి డ్యాన్స్ చేసిన స్నేహితులు భావించారు. కిందపడిన వ్యక్తిని పైకి లేపే క్రమంలో బంగారు నాయుడు నుంచి ఎటువంటి ప్రతిస్పందన లేకపోవడంతో ఒక్కసారి గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు
D.Jల చప్పుడు, సరిపడ నిద్ర లేక అప్పటికే బాగా అలసటగా ఉన్న బంగారు నాయుడు ఒక్కసారిగా హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు. వెంటనే హాస్పిటల్ కి తరలించినప్పట్టికి అప్పటికే అతను మృతి చెందాడు. గ్రామంలో ఏ ఇంట పెళ్లి పేరంటాలు జరిగిన, చావు పుట్టుకలు జరిగినా బంగారు నాయుడు ముందుంటాడు అని గ్రామస్తులు చెబుతున్నారు. ఏ ఫంక్షన్ జరిగిన ముందుంటూ ఆర్గనైజ్ చేసే వ్యక్తని, గ్రామస్తులను సమీకరించి వారితో సమన్వయం చేస్తూ కార్యక్రమంకి చేదోడు వాదోడుగా ఉంటాడని అంటున్నారు. అలాంటి మంచి వ్యక్తిని కోల్పోయినందుకు గ్రామస్తులు తీవ్ర శోకంలో ములిగిపోయారు. కళ్ళముందే ఉండే మనిషి కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో బాసూరు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి...