ముఖ్య సమాచారం
-
కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు! హరీష్ రావు, ఈటలకు కూడా..
-
బలూచిస్థాన్‌ను పాకిస్థాన్ దోచుకుంటోంది: అసోం సీఎం సంచలన వ్యాఖ్యలు
-
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
విశాఖ డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన గోవిందరెడ్డికి పవన్ కల్యాణ్ అభినందనలు
-
త్వరలో BLO(బూత్ లెవెల్ ఆఫీసర్)లకు గుర్తింపు కార్డులు: ఎన్నికల కమీషన్
-
విజయవాడ-బెంగళూరు మధ్య వందే భారత్.. ఏకంగా 9 గంటల్లోనే..
-
ఏపీ లిక్కర్ కేసులో ఏడుగురు నిందితుల రిమాండ్ పొడిగింపు.
-
నేడు ప్రకాశం పంతులుగారి వర్ధంతి
-
తెలంగాణ రాజ్ భవన్లో చోరీ
-
బెంగళూరు నగరంలో ఈ సీజన్లోనే అతిపెద్ద వర్షపాతం నమోదు
విజయవాడ-బెంగళూరు మధ్య వందే భారత్.. ఏకంగా 9 గంటల్లోనే..
Updated on: 2025-05-20 12:08:00

త్వరలో విజయవాడ - బెంగళూరు మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నడిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రతిపాదనలను సిద్ధం చేసింది. షెడ్యూల్‌తో పాటు ప్రయాణ సమయం తొమ్మిది గంటలుగా రైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో ప్రయాణికులకు దాదాపు మూడు గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది.
మొత్తం 8 బోగీల్లో 7 ఏసీ చైర్‌కార్, ఒకటి ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్ ఉండనున్నాయి. విజయవాడ – బెంగళూరు మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు (20711) మంగళవారం మినహా వారానికి ఆరు రోజులు రాకపోకలు సాగించనుంది. ఈ రైలు విజయవాడలో ఉదయం 5.15 గంటలకు బయలుదేరి తెనాలి 5.39, ఒంగోలు 6.28, నెల్లూరు 7.43, తిరుపతి 9.45, చిత్తూరు 10.27, కాట్పాడి 11.13, కృష్ణరాజపురం 13.38, ఎస్ఎంవీటీ బెంగళూరు 14.15 గంటలకు చేరుతుంది. బెంగళూరు నుంచి విజయవాడ..
తిరుగు ప్రయాణంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అదే రోజు (20712) బెంగళూరులో మధ్యాహ్నం 14.45 గంటలకు ప్రారంభమై… కృష్ణరాజపురం 14.58, కాట్పాడి 17.23, చిత్తూరు 17.49, తిరుపతి 18.55, నెల్లూరు 20.18, ఒంగోలు 21.29, తెనాలి 22.42, విజయవాడ రాత్రి 23.45 గంటలకు చేరుకోనుంది..