ముఖ్య సమాచారం
-
కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు! హరీష్ రావు, ఈటలకు కూడా..
-
బలూచిస్థాన్‌ను పాకిస్థాన్ దోచుకుంటోంది: అసోం సీఎం సంచలన వ్యాఖ్యలు
-
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
విశాఖ డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన గోవిందరెడ్డికి పవన్ కల్యాణ్ అభినందనలు
-
త్వరలో BLO(బూత్ లెవెల్ ఆఫీసర్)లకు గుర్తింపు కార్డులు: ఎన్నికల కమీషన్
-
విజయవాడ-బెంగళూరు మధ్య వందే భారత్.. ఏకంగా 9 గంటల్లోనే..
-
ఏపీ లిక్కర్ కేసులో ఏడుగురు నిందితుల రిమాండ్ పొడిగింపు.
-
నేడు ప్రకాశం పంతులుగారి వర్ధంతి
-
తెలంగాణ రాజ్ భవన్లో చోరీ
-
బెంగళూరు నగరంలో ఈ సీజన్లోనే అతిపెద్ద వర్షపాతం నమోదు
కొనుగోలు చేసిన టెస్లా కార్లన్నీ వెనక్కి ఇచ్చేస్తున్న డెన్మార్క్ కంపెనీ... కారణం ఇదే!
Updated on: 2025-05-19 19:43:00

డానిష్ నిర్మాణ సంస్థ షెర్నింగ్, తమ వద్ద ఉన్న టెస్లా కార్లన్నింటినీ వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఈ మేరకు కార్లను తిరిగి అప్పగిస్తున్న వీడియోను కూడా పంచుకుంది. టెస్లా కార్లు నాణ్యత లేనివని కాదని, కేవలం ఎలాన్ మస్క్ రాజకీయ నిబద్ధత, ఆయన బహిరంగంగా వ్యక్తం చేస్తున్న అభిప్రాయాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. "షెర్నింగ్లో, మేము కేవలం ఎలా నడపాలనేదే కాదు, ఎవరితో కలిసి ప్రయాణించాలనేది కూడా నిర్ణయించుకుంటాం. అందుకే మా టెస్లా కంపెనీ కార్ల తాళాలను తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాం. టెస్లా కార్లు చెడ్డవని కాదు, కానీ ఎలాన్ మస్క్ రాజకీయ నిబద్ధత, ఆయన బహిరంగంగా వెల్లడిస్తున్న అభిప్రాయాల (వాటిని విస్మరించడం కష్టంగా మారుతోంది) దృష్ట్యా, 'ఇంతకాలం ప్రయాణానికి ధన్యవాదాలు' అని చెప్పాలని ఒక కంపెనీగా మేము నిర్ణయించుకున్నాం" అని షెర్నింగ్ పేర్కొంది.