ముఖ్య సమాచారం
-
గుడివాడ అభివృద్ధికి రూ.136 కోట్ల నిధులు మంజూరు:ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
-
భారీ వర్షాలు.. 56 మంది మృతి
-
హైదరాబాద్‌కు కేంద్రం గుడ్ న్యూస్: 2000 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయింపు
-
కేంద్రం కేటాయించే ఇళ్లలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్
-
ఆర్టీసీ ఉద్యోగులకు ఊరట కల్పించేలా ప్రభుత్వం చర్యలు.*
-
ఏపీలో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదు...
-
హార్వర్డ్‌కు ట్రంప్ సర్కార్ షాక్: అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం!
-
కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు.. కదలికలపై పోలీసుల నిఘా
-
కోవిడ్ -19 వ్యాప్తి..ఏపీ సర్కార్ కీలక సూచనలు
-
14 సెకండ్లు నేలపై వెలిగిన పిడుగు వెలుతురు.... భయాందోళనకు గురైన ప్రజలు
ఎన్కౌంటర్ లో చనిపోయింది నంబాల కేశవరావే.... ...కేంద్ర మంత్రి అమిత్ షా
Updated on: 2025-05-21 18:46:00

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించారు. ఈ కీలక పరిణామంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.
బుధవారం ఉదయం జరిగిన ఈ ఆపరేషన్‌లో మొత్తం 27 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు, వారిలో బసవరాజు కూడా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారని ఆయన తెలిపారు. బసవరాజు తలపై రూ.1.5 కోట్ల భారీ రివార్డు ఉందని అధికారులు వెల్లడించారు. ఎన్ కౌంటర్ మృతుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఉన్నాడని ఉదయం నుంచి ఇప్పటివరకు అనే కథనాలు వచ్చినప్పటికీ, అమిత్ షా చేసిన తాజా ప్రకటనతో ఆయన మృతి విషయం నిర్ధారణ అయింది.
నక్సలిజం నిర్మూలనలో కీలక విజయం: అమిత్ షా ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ, "నక్సలిజం నిర్మూలన దిశగా సాగుతున్న పోరాటంలో ఇదొక మైలురాయి లాంటి విజయం. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో జరిగిన ఆపరేషన్‌లో 27 మంది మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, నక్సల్ ఉద్యమానికి వెన్నెముకగా భావించే నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా ఉన్నారు" అని పేర్కొన్నారు.