ముఖ్య సమాచారం
-
లిక్కర్ కేసులో రాజ్ కెసిరెడ్డికి చుక్కెదురు.. పిటిషన్లు కొట్టేసిన సుప్రీంకోర్టు
-
రాజస్థాన్లోని స్వీట్ షాపుల్లో 'మైసూర్ పాక్' పేరును 'మైసూర్ శ్రీ'గా మార్పు
-
పదవీ విరమణ తర్వాత తాను ఏం చేస్తాడో చెప్పిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్
-
ఏపీలో షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ 2025: వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్ను కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టు
-
వరదల్లో చిక్కుకున్న 50,000 మంది.. నలుగురు మృతి
-
భారత్ మనపై విసిరిన నీటి బాంబును చల్లబరచకపోతే మనం ఆకలితో చనిపోతాం: పాక్ శాసనసభ్యుడు
-
జగన్ Vs సాయిరెడ్డి..తారకరత్న భార్య సంచలన పోస్ట్!
-
పురుషుల పాలిట మృత్యుఘంటికలు మోగిస్తున్న 'బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్'!
-
అండమాన్ నికోబార్ దీవుల గగనతలం మూసివేత... నోటమ్ జారీ!
-
మనకు ఇంకా రెండు ఎస్-400లు రావాలి... రష్యా వెళుతున్న అజిత్ దోవల్
లిక్కర్ కేసులో రాజ్ కెసిరెడ్డికి చుక్కెదురు.. పిటిషన్లు కొట్టేసిన సుప్రీంకోర్టు
Updated on: 2025-05-23 21:45:00

ఏపీ లిక్కర్ స్కాం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాజ్ కెసిరెడ్డి, ఆయన తండ్రి ఉపేంద్ర రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్ కెసిరెడ్డి అరెస్టు సమయంలో అధికారులు నిబంధనలు పాటించలేదని ఆయన తండ్రి ఉపేంద్ర రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన అరెస్టు అక్రమమంటూ రాజ్ కెసిరెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 19న తండ్రీకొడుకుల పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ పార్థివాలా ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా తీర్పు వెలువరిస్తూ.. ఇప్పటికే అరెస్టయి పోలీసుల కస్టడీలో ఉన్నందున బెయిల్ కోసం సంబంధిత కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచిస్తూ ఈ పిటిషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది.