ముఖ్య సమాచారం
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
-
మద్యం కుంభకోణంలో ఎవరినీ వదిలిపెట్టం
-
కావేరీ నదిలో శవమై తేలిన పద్మశ్రీ అవార్డు గ్రహీత
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 13మంది మృతి
-
రోదసి నుంచి డేగ కన్ను... భారత నిఘా సామర్థ్యానికి కొత్త బలం: మే 18న ఇస్రో ‘రిశాట్-1బి’ ప్రయోగం
సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా..?
Updated on: 2025-01-02 08:01:00

సంక్రాంతికి రైతుకు భరోసా నిధులు విడుదల చేస్తామని ప్రకటించిన తెలంగాణ సర్కార్..ఆ దిశగా స్పీడ్ పెంచింది. సాగులో వున్న భూములకే రైతు భరోసా. సంపన్నులకు, ఉద్యోగులకు రైతు భరోసా ఉండదనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. రానున్న యాసంగి పంటకు రైతు భరోసా అందజేసేందుకు ఖరారు చేయాల్సిన విధి విధానాలపై, నివేదికలో చేర్చాల్సిన అంశాలపై చర్చించింది. సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా చెల్లించాలని, దాంతో పాటు ఎకరాల విషయంలో కొంత కటాఫ్ పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 7 నుంచి 10 ఎకరాల లోపు భూములు ఉన్న వారికే రైతు భరోసా చెల్లించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. గూగుల్ డేటా, శాటిలైట్ ఆధారంగా సాగు విస్తీర్ణం లెక్కించేందుకు పలు కంపెనీల నుంచి డేటా సేకరిస్తోంది. అలాగే టాక్స్ పేయర్స్, ప్రభుత్వ ఉద్యోగులను రైతు భరోసా అనర్హులుగా ప్రకటించాలని సూచనప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై జనవరి 4న క్యాబినెట్ భేటీలో చర్చించాలని నిర్ణయించారు.