ముఖ్య సమాచారం
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
-
మద్యం కుంభకోణంలో ఎవరినీ వదిలిపెట్టం
-
కావేరీ నదిలో శవమై తేలిన పద్మశ్రీ అవార్డు గ్రహీత
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 13మంది మృతి
-
రోదసి నుంచి డేగ కన్ను... భారత నిఘా సామర్థ్యానికి కొత్త బలం: మే 18న ఇస్రో ‘రిశాట్-1బి’ ప్రయోగం
రోదసి నుంచి డేగ కన్ను... భారత నిఘా సామర్థ్యానికి కొత్త బలం: మే 18న ఇస్రో ‘రిశాట్-1బి’ ప్రయోగం
Updated on: 2025-05-11 19:32:00

భారతదేశ సరిహద్దు నిఘా సామర్థ్యాలు, జాతీయ భద్రత మరింత పటిష్టం కానున్నాయి. ఇందుకుగాను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మే 18న శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ‘రిశాట్-1బి’ (EOS-09) అనే అత్యాధునిక రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది
దీని ప్రత్యేకత ఏమిటంటే, వర్షం, దట్టమైన పొగమంచు, మేఘాలు అడ్డుగా ఉన్నా లేదా చిమ్మచీకటిలోనైనా భూమి ఉపరితలాన్ని హై-రిజల్యూషన్ చిత్రాలను తీయగలదు. సాధారణంగా ఆప్టికల్ కెమెరా ఆధారిత ఉపగ్రహాలు ప్రతికూల వాతావరణంలో లేదా రాత్రి సమయాల్లో చిత్రాలను స్పష్టంగా నమోదు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటాయి. కానీ, రిశాట్-1బి ఈ పరిమితులను అధిగమించి నిరంతరాయ నిఘాకు వీలు కల్పిస్తుంది. ఇటీవలే జరిగిన 'ఆపరేషన్ సిందూర్' తర్వాత కొద్ది రోజులకే ఈ ప్రయోగం జరుగుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.