ముఖ్య సమాచారం
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్‌లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్‌లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
-
మద్యం కుంభకోణంలో ఎవరినీ వదిలిపెట్టం
-
కావేరీ నదిలో శవమై తేలిన పద్మశ్రీ అవార్డు గ్రహీత
-
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 13మంది మృతి
-
రోదసి నుంచి డేగ కన్ను... భారత నిఘా సామర్థ్యానికి కొత్త బలం: మే 18న ఇస్రో ‘రిశాట్-1బి’ ప్రయోగం
రైల్వేలో 9 వేలకు పైగా జాబ్స్.. గడువు తేదీ పొడిగింపు.. వెంటనే అప్లై చేయండి..
Updated on: 2025-05-10 19:53:00

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) గత నెల 9970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది . గతంలో దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీని మే 11గా నిర్ణయించారు. కానీ ఇప్పుడు దానిని మే 19 వరకు పొడిగించారు. కనుక ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దరఖాస్తులను RRB అధికారిక వెబ్సైట్ rrbapply.gov.in ద్వారా మే 19 వరకు సమర్పించవచ్చు . అంతేగాక దరఖాస్తు రుసుమును 21 మే 2025 వరకు చెల్లించే వెసులుబాటు కూడా ఉంది. ఫారమ్‌లో దిద్దుబాట్లు చేయడానికి విండో 22 మే 31 నుంచి 2025 వరకు తెరిచి ఉంటుంది.
ఇండియన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులకు 9970 ఖాళీల దరఖాస్తు ప్రక్రియను మే 19 వరకు పొడిగించింది. దరఖాస్తు రుసుమును మే 21, 2025 (రాత్రి 11:59) వరకు చెల్లించవచ్చు. ఫీజు చెల్లింపుకు చివరి తేదీ మే 21, 2025గా నిర్ణయించారు. అభ్యర్థులు ఫారమ్‌లోని లోపాలను సరిదిద్దుకోవడానికి మే 22 నుంచి మే 31, 2025 వరకు సమయం లభిస్తుంది.