ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
రైల్వే 'గేట్లపై' ఆర్.ఓ.బి. నిర్మాణానికి ఆ శాఖ అనుమతులు మంజూరు:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
Updated on: 2025-11-21 09:21:00
గుడివాడ నవంబర్ 20:గుడివాడ పట్టణంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు వేగవంతంగా జరిగేలా కృషి చేస్తున్నామని గుడివాడ ఎమ్మెల్యే వెనీగండ్ల రాము అన్నారు.సాంకేతిక కారణాలతోనే నిర్మాణ పనులు ఆలస్యం అవుతున్నాయన్నారు.
రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతిపై...
ఎన్.హెచ్.ఎ అధికారులతో ప్రజా వేదిక కార్యాలయంలో గురువారం సాయంత్రం ఎమ్మెల్యే రాము సమీక్షించారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలని అధికారులతో ఎమ్మెల్యే రాము అన్నారు.
అనంతరం ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడారు.... రైల్వే శాఖ సాంకేతిక అనుమతుల ఆలస్యం కావడంతోనే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో అవాంతరాలు వచ్చినట్లు చెప్పారు. భీమవరం, మచిలీపట్నం రైలు గేట్లపై నిర్మాణ పనులు చేపట్టేందుకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.
రైల్వే గేట్ల వద్ద కల్వర్టు,O.H.C పోల్స్, S.N.D. కేబుల్స్ నిర్మాణాలకు... రైల్వే శాఖకు ఎన్. హెచ్. ఏ. 8 కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలిపారు.నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేలా ఎంపీ వల్లభనేని బాలసౌరి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారన్నారు. ఆయన సహకారంతో ఢిల్లీ స్థాయి ఉన్నతాధికారులతో మాట్లాడి నిర్మాణ పనులు త్వరగతిన పూర్తి అయ్యేలా కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే రాము అన్నారు.