ముఖ్య సమాచారం
-
స్కూల్‌కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
Updated on: 2025-12-14 09:40:00
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
గుడివాడ రైల్వేస్టేషన్ హాల్ట్, ఆ తర్వాత భీమవరంలో కూడా.
15న విజయవాడ రైల్వేస్టేషన్లో ప్రారంభోత్సవం...17 నుంచి అమలు
విజయవాడ: వందే భారత్ రైలు సేవలు ఇక గుడివాడ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. చెన్నై- విజయవాడ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు గుడివాడలో కూడా ఆగనుంది. చెన్నై- విజయవాడ వందేభారత్ (20677) రైలును నర్సాపురం వరకు రైల్వే శాఖ పొడిగించింది. ఈ క్రమంలో గుడివాడ రైల్వే స్టేషన్లో హాల్ట్ ఇవ్వటం జరిగింది. విజయవాడ -గుడివాడ మధ్య వందేభారత్ హైస్పీడ్ రైల్లో ప్రజలు రాకపోకలు సాగించవచ్చు. గుడివాడ ప్రజలు నర్సాపురం కూడా నేరుగా వెళ్లవచ్చు. అలాగే చెన్నైకు కూడా నేరుగా ప్రయాణించవచ్చు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పట్టుబట్టి నరసాపురం వరకు వందేభారత్ ను పొడిగించుకున్నారు. దీంతో గుడివాడ ప్రజలకు వందేభారత్ రైలు అవకాశం దక్కింది. ఈనెల 15వ తేదీన విజయవాడ రైల్వేస్టేషన్లో గుడివాడ మీదుగా నరసాపురానికి వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. 17వ తేదీ నుంచి నరసాపురం వరకు పొడిగింపు అమలులోకి తీసుకురానున్నారు. పొడిగించిన వందేభారత్ రైలు 17న చెన్నైలో ఉదయం 5.30 గంటకు ప్రారంభమవుతుంది. విజయవాడకు 11.45 గంటలకు వస్తుంది. ఇక్కడి నుంచి గుడివాడ మధ్యాహ్నం 12.30 గంటలకు చేరుతుంది. భీమవరం టౌన్ 13.15 గంటలకు, నర్సాపురం రైల్వేస్టేషన్‌కు 2.10 గంటలకు వెళ్తుంది.