ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
Updated on: 2025-12-05 09:01:00
రాజధానిలో గవర్నర్ నివాసం లోక్ భవన్ నిర్మాణానికి అథారిటీ ఆమోదం
రూ.7380 కోట్ల నాబార్డు రుణ స్వీకరణకు అంగీకారం
తెలుగు వైభవంగా నీరుకొండలో ఎన్టీఆర్ విగ్రహం
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 55వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం
అమరావతి, డిసెంబరు 4: రాజధాని అమరావతిని ఓ క్రియేటివ్ సిటీగా తీర్చిదిద్దనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో నిర్మించే ప్రతీ భవనం విలక్షణంగా ఉండాలని ఆయన సూచించారు. నిర్మించే ప్రతీ భవనం ప్రస్ఫుటంగా కనిపంచే విధంగా, పచ్చదనంతో అలరారేలా నిర్మించాలని పేర్కొన్నారు.
రాజధాని నగరంలో భవనాల డిజైన్ల కోసమే గతంలో విస్తృతంగా అధ్యయనం నిర్వహించామని సీఎం స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 55వ సీఆర్డీఏ అథారిటీ సమావేశమైంది. సీఆర్డీఏ, ఏడీసీ ప్రతిపాదించిన కొన్ని అంశాలకు ఆమోదాన్ని తెలియచేసింది. అమరావతిలోని గవర్నమెంట్ కాంప్లెక్స్ లో గవర్నర్ నివాస సముదాయం లోక్ భవన్ నిర్మాణం కోసం చేసిన ప్రతిపాదనలకు అథారిటీ ఆమోదాన్ని తెలియచేసింది. రూ.169 కోట్ల వ్యయంతో లోక్ భవన్ నిర్మాణాలు చేపట్టనున్నారు. రూ. 165 కోట్ల వ్యయంతో ఏపీ జ్యూడిషియల్ అకాడెమీ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
అలాగే 2024-25 వార్షిక గణాంకాల నివేదికలకు ఆమోదం తెలిపింది. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు నాబార్డు నుంచి రూ. 7,380 కోట్ల రుణాన్ని తీసుకునేందుకు సీఎం అధ్యక్షతన సీఆర్డిఏ అథారిటీ అంగీకారాన్ని తెలిపింది. ఇ-3 సీడ్ యాక్సెస్ రహదారిని ఎన్ హెచ్ 16 జాతీయ రహదారితో అనుసంధానించేందుకు రూ.532 కోట్లతో టెండర్లను పిలిచేందుకు కూడా అథారిటి ఆమోదాన్ని తెలియచేసింది.