ముఖ్య సమాచారం
-
ఆంధ్రప్రదేశ్ హై కోర్టు(APHC)లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
-
ఈనెల 17న ఐపీఎల్-2025 పునఃప్రారంభం
-
సజ్జల శ్రీధర్రెడ్డిని కస్టడీకి ఇవ్వండి : సిట్
-
అనంత మాజీ ఎంపీ దరూరు పుల్లయ్య కన్నుమూత
-
తగ్గిన బంగారం ధరలు
-
32 ఎయిర్పోర్టుల నుంచి రాకపోకలు ప్రారంభం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ లో భారీగా చేరికలు
Updated on: 2023-10-18 18:26:00

కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ లో ఎంపీటీసీ రాజేందర్ గౌడ్ ఆధ్వర్యంలో 150 మంది చేరిక.పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. తిమ్మాపూర్ ఎంపీటీసీ రాజేందర్ గౌడ్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన 150 మంది బిఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వారికి కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ..కొత్తూరు మున్సిపాలిటీని కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.రూ. 110 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు.బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే ఈ పనులన్నీ సక్రమంగా జరుగుతాయని అందుకే యువత బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్,ఏనుగు జనార్దన్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్,కౌన్సిలర్స్ కోస్గి శ్రీనివాస్,కమ్మరి జయమ్మ జనార్ధన చారి,బ్యాగరి ప్రసన్న లత యాదయ్య ,భాస్కర్ గౌడ్, వెంకటాపురం నాగరాజు, పెద్దాపురం శ్రీనివాస్,గండేటి నరసింహ,చింతకింది పాండు, అమడపురం నరసింహ, గండేటి సాయికిరణ్,శరత్ చారి,తదితరులు పాల్గొన్నారు.