ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
Updated on: 2026-01-26 13:41:00
77వ గణతంత్ర దివస్ వేడుకలు బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం సభ్యులు...సంఘం అధ్యక్షులు రేవళ్ళ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో బొబ్బిలి పాతకోటలో గల సంఘం కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఆయన ముందుగా మాజీ సైనికులు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ... ఈరోజు నేను మాజీ సైనిక సంఘం కార్యాలయంలో జండా ఆవిష్కరణ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. అలాగే దేశ సరిహద్దుల్లో సైనికులు విధులు నిర్వహిస్తూ చేసిన సేవలను కొనియాడారు. ఈరోజు మనం ఇక్కడ ప్రశాంతంగా స్వేచ్ఛ వాయువులు పిలుస్తూ జీవించగలుగుతున్నామంటే అది దేశి సైనికులే అని అన్నారు. మనకి స్వాతంత్రాన్ని తెచ్చిన పెద్దలు అందరి స్ఫూర్తిని, దేశభక్తిని మనం మన తర .తరాలకు తెలియజేసేలా చాటుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మరడరామినాయుడు ఉపాధ్యక్షులు రెడ్డి రామకృష్ణ కార్యదర్శి ఏ గోవింద నాయుడు కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ ఆర్ మోహనరావు ట్రెజరర్ వి ఎన్ శర్మ మాజీ సైనిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.