ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
Updated on: 2026-01-27 16:42:00
భారత్-ఐరోపా సమాఖ్యల మధ్య స్వేచ్ఛా వాణిజ్యఒప్పందం కుదిరినట్లు మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. ఈ ఒప్పందంతో పలు ఐరోపా ఉత్పత్తులపైనా దిగుమతి సుంకాలు భారీగా దిగిరానున్నాయి. ముఖ్యంగా లగ్జరీ కార్లు, వైన్, స్పిరిట్‌తో పాటు మెడికల్ ఉత్పత్తుల పైనా సుంకాల భారం తగ్గనుంది. ఈ ఒప్పందంపై పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కానప్పటికీ.. డీల్ ఖరారైన తర్వాత ఈయూ చేసిన ప్రకటనతో కొన్ని ఉత్పత్తులపై సుంకాల వివరాలు బయటకు వచ్చాయి.
ఈ స్వేచ్ఛా వాణిజ్యఒప్పందం వచ్చే ఏడాది అమల్లోకి రానున్నట్లు ఐరోపా సమాఖ్య తమ ప్రకటనలో వెల్లడించింది. ఇది అమల్లోకి వచ్చిన తొలిరోజే 90శాతం భారత ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తొలగించనున్నట్లు పేర్కొంది. మిగతా వాటిపై దశలవారీగా సుంకాలను ఎత్తివేస్తామని తెలిపింది. ఇక, భారత్‌లో రానున్న పదేళ్లలో 93శాతం ఐరోపా ఉత్పత్తులకు దశల వారీగా సుంకం తొలగిపోనున్నట్లు చెప్పింది. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన తొలిరోజు 30 శాతం ఐరోపా ఉత్పత్తులపై భారత్ సుంకాలను ఎత్తివేయనున్నట్లు వెల్లడించింది.
డీల్ లోని కీలక అంశాలివే..
ప్రస్తుతం ఐరోపాకు చెందిన ఆటోమొబైల్ ఉత్పత్తులపై భారత్ 66శాతం నుంచి 125 శాతం దిగుమతి సుంకాలు వసూలు చేస్తోంది. ఈ సుంకాలు దశలవారీగా తగ్గనున్నాయి. లగ్జరీ కార్లపై సుంకాలను తొలుత 40 శాతానికి.. ఆ తర్వాత 10 శాతం వరకు తగ్గించే అవకాశాలున్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాలపై భారత సుంకాల తగ్గింపు.. ఒప్పందం అమల్లోకి వచ్చిన ఐదో ఏడాది నుంచి మొదలవుతుంది. సెగ్మెంట్లను బట్టి ఈ సుంకం తొలి ఏడాది 30-35శాతానికి తగ్గనుంది. ఆ తర్వాత నుంచి మరింత దిగి రానుంది.
ప్రస్తుతం వైన్‌పై 150శాతం టారిఫ్‌లను భారత్ వసూలుచేస్తోంది. ప్రీమియం వైన్లపై సుంకాలు ఏడేళ్లలో 20శాతానికి దిగి రానున్నాయి. మీడియం-రేంజ్ వైన్‌పై టారిఫ్‌లు 30శాతం తగ్గనున్నాయి.
ప్రస్తుతం ఐరోపా విస్కీ, వోడ్కా, రమ్, జిన్ వంటి స్పిరిట్లపై మన దేశంలో 150శాతం వరకు సుంకాలు ఉండగా.. తాజా ఒప్పందంతో అవి 40శాతానికి దిగిరానున్నాయి. ఇక, బీర్లపై 110శాతం ఉన్న దిగుమతి సుంకం.. 50శాతానికి తగ్గనుంది.
ప్రస్తుతం భారత్‌లో యంత్రాలపై 44శాతం, కెమికల్స్‌పై 22 శాతం, ఫార్మా ఉత్పత్తులపై 11శాతం సుంకాలు ఉండగా.. వీటిల్లో చాలావరకు సుంకాలను ఎత్తివేసే అవకాశం ఉంది. ఆప్టికల్స్, మెడికల్, సర్జికల్ పరికరాలపై సున్నా టారిఫ్‌లు ఉండనున్నాయి.
ఈయూ నుంచి దిగుమతి అయ్యే ఆలివ్ ఆయిల్, మార్గరైన్, వెజిటబుల్ ఆయిల్‌పై కూడా సుంకాలను ఎత్తివేయనున్నారు.
డైరీ ఉత్పత్తులు, సోయా మీల్, పప్పులపై భారత్ ఎలాంటి సుంకాల మినహాయింపు కల్పించలేదు. ఇక, ఈయూ కూడా చక్కెర, బీఫ్, మాంసం, పౌల్ట్రీ రంగ ఉత్పత్తులకు డ్యూటీ రాయితీ కల్పించలేదు.