ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
Updated on: 2026-01-24 18:15:00
ఉపాధ్యాయులకు ఏప్రిల్, మే నెలల్లో బదిలీలు, పదోన్నతులు చేపట్టనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఉపాధ్యాయ సంఘాల నేతలతో నిర్వహించిన సమావేశంలో అధికారులు పలు అంశాలను వెల్లడించారు. హైస్కూల్ ప్లస్‌లో ఖాళీల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, వేసవి సెలవుల్లో పని చేసిన టీచర్లకు ఆర్జిత సెలవులు ఇవ్వనున్నామని తెలిపారు. వీటికి సంబంధించిన ఉత్తర్వులు వారం రోజుల్లో ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రెగ్యులర్ ఖాళీలు భర్తీ అయ్యే వరకు క్లస్టర్ టీచర్స్ పాఠ శాలలు మారుతూ ఉండాల్సి ఉంటుందని, బదిలీల కౌన్సెలింగ్‌లో పాత పాయింట్లు పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ఉపాధ్యాయ సంఘాలతో ఇక నుంచి ప్రతి వారం సమావేశాలు నిర్వహిస్తామని, జీతాల సమస్య ఉంటే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ పదోన్నతులు ఎస్జీటీలకు 30:70 నిష్పత్తిలో చేపడతామని అధికారులు తెలపగా 70:30 నిష్పత్తి ప్రకారం కల్పించాలని సంఘాల నేతలు కోరారు.