ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
సమస్యాత్మక మరియు సున్నితమైన ప్రాంతాల్లో పోలీసు మరియు స్పెషల్ యాక్షన్ టీమ్ ల ఫూట్ మార్చ్ మరియు వాహన తనిఖీలు.
Updated on: 2023-11-20 20:44:00

పాత నేరస్థులకు కౌన్సిలింగ్, MCC ఉల్లంఘించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి గురించి ప్రజల్లో అవగాహన కల్పించేలా పలు గ్రామాల్లో సమావేశాలు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకునే ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా కరీంనగర్ లోని వన్ టౌన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు వీధుల్లో సోమవారం నాడు స్థానిక పోలీసులు మరియు స్పెషల్ యాక్షన్ టీం ల ఆధ్వర్యంలో ఫూట్ మార్చ్ మరియు వాహన తనిఖీలు చేపట్టించామని కరీంనగర్ పోలీసు కమీషనర్ అభిషేక్ మహంతి తెలిపారు.
ఈ చర్యల్లో భాగంగా నేడు హౌసింగ్ బోర్డు కాలనీ, నాఖా చౌరస్తా, రాజీవ్ చౌక్ వీధుల్లో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. గతంలో ఎన్నికల సమయంలో జరిగిన సంఘటనల ఆధారంగా సమస్యాత్మక మరియు సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించబడి, రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసేంతవరకు శాంతి భద్రతలకు మరియు ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే అవకాశం ఉన్నటువంటి పలు వీధుల్లో సమావేశాలు నిర్వహించి ప్రజల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి పై అవగాహన కార్యక్రమం కల్పించడం తో పాటు ఇట్టి వీధుల్లో ఉన్నటువంటి ఎన్నికల నేరస్తులు, రౌడీ షీటర్లు, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే వ్యక్తులను సమావేశపరిచి, ప్రజల సమక్షంలో ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కింద కేసులు నమోదు చేస్తామన్నారు.ముందస్తు చర్యల్లో పలువురు పాత నేరస్థులను ఇప్పటికే సంబంధిత అధికారుల ముందు బైండోవర్ చేసామని, ఉల్లంఘించినట్లయితే పూచికత్తు సొమ్ము జప్తు చేయబడుతుందని అవసరమైతే జైలు శిక్ష కూడా విధించబడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిష్పక్షపాతంగా పూర్తి పారదర్శకతతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేసేలా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ ముగిసేలా చూడడమే ముఖ్య ఉద్దేశం అన్నారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ టౌన్ ఏసీపి లు నరేందర్, సీఐ లు రవికుమార్ (వన్ టౌన్), శ్రీనివాస్ (త్రీ టౌన్ ), హెడ్ క్వార్టర్ నుంచి స్పెషల్ యాక్షన్ టీంలు, స్థానిక పోలీసులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.