ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్‌లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్‌లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్‌లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
నేడు కరీంనగర్ 2 డిపో లో పందెం కోడి వేలం
Updated on: 2024-01-12 09:03:00

కరీంనగర్ జిల్లా:పందెంకోడి కి వేలం వేయ డానికి కరీంనగర్-2 డిపో అధికారులు సిద్ధమ య్యారు.ఈనెల తొమ్మిదో తేదీన గుర్తు తెలియని ప్రయా ణికుడు పందెంకోడిని బస్సులో మర్చిపోయాడు. దానిని తీసుకోవడానికి గత మూడు రోజులుగా ఎవరూ రాలేదు.దీంతో అధికారులు పందెం కోడిని వేలం వేయడానికి తేదీ ఖరారు చేశారు.ఈ రోజు శుక్రవారం మధ్యా హ్నం 3 గంటలకు డిపో కార్యాలయంలో బహిరంగ వేలం వేసేందుకు ఒక ప్రక టన విడుదల చేశారు.ఆసక్తి గలవారు ఈ వేలంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు.వివరాల్లోకి వెళ్తే ఈ నెల 9న వరంగల్ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా వేము లవాడ వెళ్తున్న బస్సు కరీం నగర్ బస్ స్టేషన్ వద్ద ఆగిన సమయంలో పందెం కోడిని తన వెంట తీసుకు వెళ్తున్న ప్రయాణికుడు దానిని బస్సులోనే మరిచి వెళ్లి పోయాడు.బస్సులో బ్యాగ్ గమనించిన సహచర ప్రయాణికులు విషయాన్ని కంట్రోలర్ దృష్టికి తెచ్చారు.అందులో ఏముందో పరిశీలించేందుకు ఆర్టీసీ సిబ్బంది దానిని తెరిచి చూడగా,భద్రంగా ప్యాక్ చేసి ఉన్న పందెంకోడి కనపడింది.దీంతో దాన్ని సంరక్షించేం దుకు ఆర్టీసీ సిబ్బంది కరీనంగర్(2) డిపోకు తరలించారు.మూడు రోజులుగా సిబ్బంది అటు ఆర్టీసీ బస్సులతో పాటు పందెపుకోడి సంరక్షణ బాధ్యతలు చూసుకుంటు న్నారు.దానిని తీసుకు వెళ్లేందుకు యజమాని వచ్చే అవ కాశాలు కనిపించకపోవ డంతో ఈరోజు వేలానికి ముహూర్తం నిర్ణయించారు.