ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
*రాయచోటి వందపడకల ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి
Updated on: 2024-01-24 12:07:00
*ఓపి, ఐపి సేవలు పెరగాలి...* *వైద్యాధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలి...* రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించి ప్రజల మన్ననలను పొందాలని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి సూచించారు. బుధవారం రాయచోటి వందపడకల ఆసుపత్రిని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి ఉదయం 9.15 గంటలకు ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఓపి గదులు,పార్మసీ, ల్యాబ్, ఫిజియో థెరఫీ, నర్సింగ్ స్టేషన్లు తదితర విభాగాలను పరిశీలించారు. రోగులతో మమేకమై అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్యం,మందులు,ఆహారం పంపిణీ, పరిశుభ్రత తదితర వివరాలను రోగులను అడిగి తెలుసుకున్నారు. *హాజరుపట్టిక తనిఖీ...* వైద్యాధికారుల హాజరు పట్టికను శ్రీకాంత్ రెడ్డి క్షుణ్ణంగా పరిశీలించారు.వైద్యాధికారులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని సూచించారు. ప్రతి రోజూ ఓపి ఎంతమంది వస్తున్నారని అడగ్గా,600 మంది వస్తున్నారని వైద్యాధికారులు తెలిపారు.ఓపి వెయ్యి మందికి పైగా వచ్చేలా కృషి చేయాలని సూచించారు. ఐపీ సేవలను పెంచాలని సూచించారు.చిత్తశుద్ధి,అంకితభావంతో సేవలు అందించి ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రజలకు మరింత నమ్మకము పెంచేలా సేవలు అందించాలని కోరారు. *ప్రసవాల సంఖ్యను పెంచాలి...* ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి గర్భిణీకి ఇక్కడనే సుఖ ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు.
క్లిష్ట పరిస్థితుల్లో తప్ప ఇతర ప్రాంతాలకు రెఫర్ చేయొద్దని సూచించారు. *పరిశుభ్రత పెంపొందాలి...* ఆసుపత్రిలోని అన్ని విభాగాలతో పాటు ఆసుపత్రి ప్రాంగణంలో కూడా పరిశుభ్రత పెంపొందాలని ఆసుపత్రి పర్యవేక్షకుడు డా టి డేవిడ్ సుకుమార్ కు ఆయన సూచించారు. బెడ్లుపై ప్రతి రోజూ బెడ్ షీట్లను మార్చాలని ఆదేశించారు. *అన్ని విభాగాలను నూతన భవనాలలోకి మార్చాలి...* నూతన భవనాలలోకి అన్ని విభాగాలను మార్చాలని సూచించారు. బ్లడ్ బ్యాంకు ఏర్పాటుకు అవసరమైన విద్యుత్ సామర్ధ్యం ఉండేలా చూసుకోవాలన్నారు.ఆక్సిజన్ పైప్ లైన్ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. ఫర్నీచర్, మెడిసిన్, నీటి సరఫరా తదితర అంశాలపై ఆయన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.