ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
అక్రిడేషన్ల జారీలో అక్రమాలు...!?
Updated on: 2024-03-15 17:50:00
పార్వతీపురం మన్యం జిల్లాలో అక్రిడేషన్ల జారీలో అక్రమాలు జరిగినట్లు పార్వతీపురం జర్నలిస్టు ఫారం ప్రతినిధులు ఆరోపించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పార్వతీపురం జర్నలిస్ట్ ఫోరం (పిజేఎఫ్) గౌరవ అధ్యక్షులు వంగల దాలి నాయుడు, ప్రధాన కార్యదర్శి టి. రామ్మోహన్, ట్రెజరర్ ఉపేంద్ర తదితరులు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో జర్నలిస్టులకు జారీచేసిన అక్రిడేషన్ల జాబితా కావాలంటూ సమాచార హక్కు చట్టం ద్వారా డిఐపిఆర్ఓ కార్యాలయం, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమాచారం కోరినట్లు వారు తెలిపారు. అక్రిడేషన్లు జాబితా కావాలని గతంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో కోరినప్పటికీ స్పందన లేదన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదన్నారు. ఇటీవల సమాచార హక్కు చట్టంలో అడిగినప్పటికీ ప్రశ్నల రూపమంటూ తిరిగి సమాధానం ఇచ్చారన్నారు. గతంలో అడిగిన సమాచారంలో 16వ పాయింట్ లో తమ కార్యాలయ పరిధిలో జారీచేసిన అక్రిడేషన్ల జాబితా పూర్తి వివరాతో ఇవ్వగలరు అని సమాచారం కోరినా అందులో కూడా ప్రశ్న రూపం ఉందంటూ సమాధానం ఇవ్వాలేదన్నారు. అందుకే మరలా సమాచార హక్కు చట్టంలో సమాచారం కోరడం జరిగిందన్నారు. ఇదిలా ఉండగా డి ఐ పి ఆర్ ఓ కార్యాలయం అక్రిడేషన్ల జారీలో తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. నిబంధనలకు వ్యతిరేకంగా జారీ చేశారన్నారు. రోజు ప్రింట్ కాని పేపర్లుకు, సర్చ్యులేషన్ లేని పేపర్లకు తమ ఇష్టారాజ్యంగా అక్రిడేషన్లు జారీ చేశారన్నారు. జిల్లాలో పని చేయనివారికి, అలాగే రూరల్ రిపోర్టర్లుగా పనిచేస్తున్న వారికి డెస్క్ జర్నలిస్టులుగా, కనీసం అవగాహన లేనటువంటి వారికి ఆయా హోదాలలో అక్రిడేషన్లు జారీ చేశారన్నారు. అక్రిడేషన్ల జారీలో పలు అవకతవకుల జరిగినట్లు ఆరోపించారు. ఏ తప్పు లేకపోతే ఎందుకు అక్రిడేషన్ జాబితా ఇవ్వటం లేదనేది అధికారులకే తెలియాలన్నారు. ఇక కలెక్టర్ కార్యాలయం నుండి ఇచ్చే వార్తలన్నిటికి వీడియోలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రెస్ నోట్లు కూడా సక్రమంగా రాయలేని పరిస్థితి ఉందన్నారు. తప్పులు తడకలుగా, అక్షర దోషాలతో ఇస్తున్నారన్నారు. అధికారులను మభ్యపెట్టి పబ్బం గడుపుకునే పరిస్థితి నెలకొందన్నారు. అక్రిడేషన్ లో జారీలో జరిగిన అక్రమాల మూలంగా అనర్హులు ప్రభుత్వ ఇళ్ల స్థలాలు, బస్సు సదుపాయాలను పొందే అవకాశం ఉందన్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి అక్రిడేషన్ల జారీలో జరిగిన అక్రమాలను గుర్తించి సంబంధిత అధికారులపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నామని వారు తెలిపారు.