ముఖ్య సమాచారం
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
-
మద్యం కుంభకోణంలో ఎవరినీ వదిలిపెట్టం
-
కావేరీ నదిలో శవమై తేలిన పద్మశ్రీ అవార్డు గ్రహీత
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 13మంది మృతి
-
రోదసి నుంచి డేగ కన్ను... భారత నిఘా సామర్థ్యానికి కొత్త బలం: మే 18న ఇస్రో ‘రిశాట్-1బి’ ప్రయోగం
పట్టా ఒకరిదైతే పాసుబుక్కు మరొకరికిచ్చిన వీఆర్వో..
Updated on: 2024-03-31 08:59:00

మదనపల్లిలో రైతుపై హత్యాయత్నం.. భూమికోసం గొడవపడ్డ ఇద్దరు రైతులు భూ యజమాని పై డూప్లికేట్ ఆన్ లైన్ లు పొందిన మరో రైతు కొడవలితో నరికి హత్య యత్నం బాధిత రైతు నాగరాజ పరిస్థితి విషమించడంతో తిరుపతికి తరలింపు కొడవలితో రైతు నాగరాజను నరికిన వ్యక్తి గతంలో మదనపల్లి రెడ్డి ఫుడ్స్ ఫ్యాక్టరీ వద్ద యువకుడి తల నరికి వేరు చేసిన హత్య కేసులో ముద్దాయిగా సమాచారం అన్నమయ్య జిల్లా, మదనపల్లి మండలంలోని పాలెంకొండలో రెవెన్యూ మోసాలకు సామాన్య రైతుల మధ్య విభేదాలు తలెత్తి ఆదివారం ఉదయం గొడవలు చేసుకున్నారు. గొడవలు తారా స్థాయికి చేరడంతో ఓ రైతును మరో రైతు కొడవలితో అందరికీ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుని వివరాల ప్రకారం.. పాలెం కొండకు చెందిన రైతు బి నాగరాజు(49) కు వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమి ఊరికి సమీపంలో ఉంది. పక్కనే నాలుగు లైన్ల జాతీయ రహదారి వెళుతూ ఉండడంతో భూములకు అమాంతంగా రేట్లు పెరిగాయి. ఆ భూమిపై కన్నేసిన చిన్నప్ప, మురళి, చిన్నక్కలు నాగరాజా పొలాన్ని ఆక్రమించుకోవడానికి గుట్టుగా భూమిని వారి పేరుతో ఆన్లైన్ చేయించుకున్నారు. అంతటితో ఆగకుండా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తున్నడంతో నాగరాజ అడ్డుకున్నాడు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో నాగరాజపై చిన్నప్ప మురళి కొడవళ్లతో దాడి చేసి తల, వేళ్ళు తెగ నరికి హత్యాయత్నం కు పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ బాధిత రైతును కుటుంబీకులు స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి చికిత్స అనంతరం అతని పరిస్థితి విషమించడంతో తిరుపతికి రిఫర్ చేశారు.. తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా గతంలో మదనపల్లి మండలం బెంగళూరులోనే రెడ్డి ఫుడ్స్ ఫ్యాక్టరీ వద్ద ఓ యువకుడి ని దారుణంగా హత్య చేసి తల నరికి వేరు చేసిన కేసులో ముద్దాయిగా నరికిన వ్యక్తి ఉన్నట్లు సమాచారం