ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
కాంగ్రెస్ 100 రోజుల పాలనలో అన్ని వర్గాలను మోసం చేసింది.మాజీ మంత్రి హరీష్ రావు
Updated on: 2024-04-05 21:35:00
కాంగ్రెస్ 100 రోజుల పాలనలో అన్ని వర్గాలను మోసం చేసింది. అదే క్రమంలో ఉపాధ్యాయులను, ఉద్యోగులను కూడా వంచించింది. కాంగ్రెస్ ఉద్యోగులకు 4 డీఏలు బకాయి పడింది. డీఏపై నిర్ణయం తీసుకుంటామని రివ్యూ మీటింగ్ పెట్టి మోసం చేసింది. ఇప్పుడు రిటైర్ అవుతున్న ఉద్యోగుల బెనిఫిట్స్ కూడా ఇప్పుడు కాకుండా, మూడేళ్ల తర్వాత ఇస్తామని లీకులు వదులుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగులపై ఏసీబీ విజిలెన్స్ దాడులతో వేధింపులకు పాల్పడుతున్నది. గతంలో కేసీఆర్ గారు 73 శాతం పీఆర్సీ అందించారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పీఆర్సీ అందించాలి. ఈ దిశగా వెంటనే నిర్ణయం తీసుకోవాలి. గొల్ల కురుమలకు 100 రోజుల్లో గొర్రెలు ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి తర్వాత స్పందించలేదు. ఒకరోజు కూడా రివ్యూ చేయలేదు. కనీసం కట్టిన డీడీలను కాడా వాపస్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం రెండో విడత గొర్రెల పంపిణీ చేయాలి. స్వతంత్ర భారతంలో మొదటిసారి ముస్లిం మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వని తొలి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వక్ఫ్ బోర్డుకు జ్యూడిషల్ పవర్ ఇస్తామని మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇమామ్లకు వేతనాలు అందడం లేదు. 12 వేలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్ పండగలకు గత ప్రభుత్వం పేదలకు బట్టలు పంపిణీ చేసేది. కాంగ్రెస్ ఈ రంజన్ పండగకు ముస్లింలకు తోఫా బంద్ చేసింది. ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకొని ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు తక్షణమే 3 డీఏలు విడుదల చేయాలి. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్న ప్రభుత్వ.. తన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వకపోవడం బాధాకరం. కొంత మంది ఉద్యోగులకు మాత్రమే నెల మొదటి వారంలో జీతం ఇచ్చి అందరికీ ఇస్తున్నామని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా మొదటి తేదీన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం.