ముఖ్య సమాచారం
-
వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్.. అయినా బయటకు రావడం కష్టమే
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
-
ఏపీ ఎడ్సెట్.. రేపే లాస్ట్ డేట్
-
శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. 4 గురు కూలీలు మృతి
నా విజయం.. కోవూరు అభివృద్ధి ఖాయం: నామినేషన్ వేసిన ప్రశాంతిరెడ్డి
Updated on: 2024-04-18 18:51:00

ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవడంతో ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జిల్లాలో తొలి నామినేషన్ వేశారు. కోవూరు కూటమి టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... కోవూరు ప్రజల మధ్య నామినేషన్ వేయడం ఆనందంగా ఉందన్నారు. ‘‘నా విజయం ఖాయం.. కోవూరు అభివృద్ధి ఖాయం’’ అని స్పష్టం చేశారు. సైకిల్ గుర్తుకి ఓటు వేసి ఎంపీ, ఎమ్మెల్యేలను గెలిపించాలని కోరారు. ప్రశాంతి నామినేషన్కు వచ్చిన ఆదరణ చూస్తే గెలిచినట్టే భావిస్తున్నామని వేమిరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యిపోయారన్నారు. ప్రతి దగ్గర అనూహ్య స్పందన కనిపిస్తుందని తెలిపారు. రాష్ట్రం మొత్తం ప్రతి నియోజకవర్గం ఒక ఊపు కనిపిస్తుందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తుందని.. ఎన్డీఏలో ఉండటం వలన అభివృద్ధి సులువవుతుందని చెప్పారు. ఐదు మందిని ఆహ్వానిస్తే వేలమంది వచ్చారని టీడీపీ నేత నారాయణ అన్నారు. రాజకీయాలకు వేమిరెడ్డి డబ్బు సంపాదించుకోవడానికి రాలేదని.. వైసీపీలో దక్కని గౌరవం టీడీపీలో దక్కుతుందని వచ్చారని తెలిపారు. నెల్లూరు పార్లమెంట్ను, కోవూరు నియోజకవర్గన్ని అభివృద్ధి కోసమే పోటీ చేస్తున్నారని వెల్లడించారు. టీడీపీ గెలుపుతోనే కోవూరు అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.