ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Updated on: 2024-05-26 19:28:00
రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండల బూర్గుల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2006-2007 పదవ తరగతి కలిసి చదువుకున్న విద్యార్థులు 17 సంవత్సరాల తరువాత ఆదివారం NH 44హోటలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించుకున్నారు.. ఇన్ని సంవత్సరాల తర్వాత నాటి స్నేహితులను కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు. విద్యార్థినీ విద్యార్థులు ఒకరినొకరు ఆత్మీయంగా పలుకరించుకొని యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు..నాడు పాఠశాల్లో గడిపిన మధుర స్మృతులను జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని సంతోషంగా గడిపారు ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యాసించి అత్యున్నత స్థానాల్లో స్థిరపడ్డారు. ఒకవేళ చేయకపోతే నాడు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా అధ్యాపకులు శశదర్,సంతోష్ రాజకుమారి లు మాట్లాడుతూ తమను పిలిపించి ఇంతటి తీపి జ్ఞాపకాలను తిరిగి ఆస్వాదించేలా చేయడం ప్రతి విద్యార్థి ఉన్నత స్థానంలో ఉండడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉపాధ్యాయ బృందానికి పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు.సాయంత్రం వరకు సందడిగా గడిపారు. ఇటీ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.