ముఖ్య సమాచారం
-
అనంత మాజీ ఎంపీ దరూరు పుల్లయ్య కన్నుమూత
-
తగ్గిన బంగారం ధరలు
-
32 ఎయిర్పోర్టుల నుంచి రాకపోకలు ప్రారంభం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
కొండబాబు ఆధ్వర్యంలో కాకినాడలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
Updated on: 2024-05-28 16:50:00

తెలుగు జాతి గొప్ప తనాన్ని యవత్ ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులు తెలుగు ప్రజల గుండె చప్పుడు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు కొనియాడారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 101 వ జయంతి వేడుకలు కాకినాడలో వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కాకినాడ జిల్లా పార్టీ కార్యాలయంలో వనమాడి కొండబాబు చిక్కాల రామచంద్రరావు, వాసిరెడ్డి ఏసుదాసు, మల్లిపూడి వీరు, నులుకుర్తి వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు కార్యకర్తలు మథ్య ఘనంగా నిర్వహించారు. తొలుత అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు వనమాడి కొండబాబు, చిక్కాల రామచంద్రరావు చేతుల మీదుగా వృద్ధులకు వస్త్రాలు పంపిణీ చేశారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వద్ద నందమూరి తారక రామారావు బసవతారకం బస్ షెల్టర్ నందు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వనమాడి కొండబాబు, చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ తెలుగు ప్రజల గుండె చప్పుడు ఆరాధ్య దైవం నటరత్న అన్న ఎన్టీఆర్ గారిని, సామాన్య కుటుంబంలో జన్మించి నాటక రంగంలో రాణించి సినీ రంగంలోకి ప్రవేశించి, సాంఘీక, పౌరాణిక, ఆధ్యాత్మిక పాత్రలు పోషించి, సినిమాలలో నటించి ఆయన ఏమిటో నీరూపించుకున్న తర్వాత తనను అత్యధికంగా ఆదరించిన తెలుగు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో రాజకీయ రంగంలోకి ప్రవేశించి తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా ఆర్థికంగా బలోపేతం చేసిన ఘనత అన్న ఎన్టీఆర్ కి మాత్రమే దక్కుతుందని, ప్రతీ పేద వాడికి కూడు, గుడ్డ, నీడ, అందించాలని ఆశయంతో సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పేద వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఆర్థిక చేయూతను అందించిన మహనీయులు అన్న ఎన్టీఆర్ గారిని, అన్న ఎన్టీఆర్ ఆశీస్సులతో చంద్రబాబు సారధ్యంలో తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి అత్యంత మెజార్టీతో ప్రభుత్వాన్ని స్థాపించడం ఖాయమని పేర్కొన్నారు.