ముఖ్య సమాచారం
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
-
ఏపీ ఎడ్సెట్.. రేపే లాస్ట్ డేట్
-
శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. 4 గురు కూలీలు మృతి
-
ప్రయాణికులకు అలర్ట్.. ఆరు ప్రధాన నగరాలకు విమానాలు రద్దు..!
పోలీస్ స్టేషన్లో తనిఖీ చేసిన ఎస్పీ
Updated on: 2024-06-22 15:04:00

శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీమతి జి.ఆర్.రాధిక శనివారం ఉదయం బుర్జా పోలీస్ స్టేషన్ ని సందర్శించి తనిఖీలు నిర్వహించారు.ఈ క్రమంలో ముందుగా పోలీస్ స్టేషన్ సిబ్బంది జిల్లా ఎస్పీ నకు గౌరవ వందనం సమర్పించారు.అనంతరం జిల్లా ఎస్పీ స్టేషన్ ఆవరణంలో పరిసరాలు పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎటువంటి అనాధికారమైన కేసు ప్రాపర్టీని స్టేషన్లో ఉంచకుండా కోర్టు ఉత్తర్వులు మేరకు డిస్పోజల్ చేయాలని సూచించారు. స్టేషన్ నిర్వహణ రికార్డులు, ముఖ్యమైన కేసుల ఫైల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. కేసుల దర్యాప్తుపై అధికారులను అడిగి తెలుసుకుని,దర్యాప్తుపై దిశానిర్దేశాలు చేశారు. బాధితులు,పిర్యాదు దారుల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించి వారి సమస్యలఫై సానుకూలంగా స్పందించి చట్ట ప్రకారం న్యాయం చేయాలన్నారు. నాటు సారా,గంజాయి వంటి మాదక ద్రవ్యాలు క్రయ, విక్రయాలు,అక్రమ రవాణా ను అరికట్టాలని, మాదకద్రవ్యాలు వినియోగం వలన కలిగే దుష్ప్రభావలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.రహదారి ప్రమాదాల నివారణకు ప్రణాళిక మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎస్పీ సూచించారు. జిల్లా ఎస్పీ వెంట ఆమదాలవలస సీఐ దివాకర్, బుర్జ ఎస్ఐ ఉన్నారు.