ముఖ్య సమాచారం
-
ఆంధ్రప్రదేశ్ హై కోర్టు(APHC)లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
-
ఈనెల 17న ఐపీఎల్-2025 పునఃప్రారంభం
-
సజ్జల శ్రీధర్‌రెడ్డిని కస్టడీకి ఇవ్వండి : సిట్
-
అనంత మాజీ ఎంపీ దరూరు పుల్లయ్య కన్నుమూత
-
తగ్గిన బంగారం ధరలు
-
32 ఎయిర్‌పోర్టుల నుంచి రాకపోకలు ప్రారంభం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్‌లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
ఏపీ టు ఆఫ్రికా.. రేషన్ బియ్యం స్కామ్ లో అడ్డంగా బుక్కైన ద్వారంపూడి
Updated on: 2024-07-02 07:13:00

రేషన్ బియ్యం స్కామ్‌ను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.ఈ స్కామ్‌లో కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోంది.రెండు రోజులుగా పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో మకాం వేశారు.కాకినాడ సిటీలో,పోర్టులో స్వయంగా మంత్రి నాదెండ్ల తనిఖీలు చేశారు.కాకినాడ పోర్టులో అశోక్ ఇంటర్నేషనల్,హెచ్ వన్ గోడౌన్లలో భారీగా రేషన్ బియ్యం గుర్తించారు.ఆ బియ్యాన్ని ఆఫ్రికాకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం అందుకుని అధికారులు.రెండు గోడౌన్లను సీజ్ చేశారు.రేషన్ బియ్యం అక్రమ రవాణా అంతా ద్వారంపూడి ఫ్యామిలీ కనుసన్నల్లో జరిగిందటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.కాకినాడ పోర్టును ద్వారంపూడి.. తన అక్రమాలకు అడ్డాగా మార్చుకున్నాడని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.ద్వారంపూడి అరాచకాలు చూసి తానే ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చారు.తనిఖీలు పూర్తి అయ్యేంత వరకు పోర్టు నుంచి బియ్యం రవాణా నిలిపివేశారు.రాష్ట్రంలో పేదల పొట్ట కొట్టి అదే రేషన్ బియ్యాన్ని ఆఫ్రికన్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారంటూ మండిపడ్డారు.పౌరసరఫరాల శాఖ సంబంధించి శాఖపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు.పూర్తిస్థాయి పరిశీలన జరిపాక సీఐడీతో విచారణ కూడా జరిపిస్తామని మంత్రి నాదెండ్ల అన్నారు.