ముఖ్య సమాచారం
-
ఆంధ్రప్రదేశ్ హై కోర్టు(APHC)లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
-
ఈనెల 17న ఐపీఎల్-2025 పునఃప్రారంభం
-
సజ్జల శ్రీధర్‌రెడ్డిని కస్టడీకి ఇవ్వండి : సిట్
-
అనంత మాజీ ఎంపీ దరూరు పుల్లయ్య కన్నుమూత
-
తగ్గిన బంగారం ధరలు
-
32 ఎయిర్‌పోర్టుల నుంచి రాకపోకలు ప్రారంభం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్‌లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కార్యాచరణ - ఆదిరెడ్డి శ్రీనివాస్
Updated on: 2024-07-13 15:40:00

నగరంలో వర్షపు నీరు నిలవకుండా డ్రైనేజీ వ్యవస్థను పటిష్టవంతం చేస్తాం - జోరు వానలో 22, 36 డివిజన్లలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న...
రాజమహేంద్రవరం : నగరంలో కురిసిన వర్షపు నీరు నిలువ ఉండకుండా డ్రైనేజీలు ద్వారా దిగువ ప్రాంతానికి పారుదలయ్యే విధంగా డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేయడం వలన.. ఇంత వర్షం పడుతున్న రోడ్లపై చుక్క నీరు కూడా లేదని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి నగరంలోని 22, 36 డివిజన్లలో పర్యటించి అక్కడ ప్రజా సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గత నెల రోజులుగా నగరంలోని డ్రైనేజీ వ్యవస్థను పటిష్ట పరచటం కారణంగా ఈరోజు ఏక దాటిగా దాదాపు ఎనిమిది గంటల పాటు వర్షం పడిన వర్షపు నీరు నిలవ ఉండకుండా డ్రైనేజీలు ద్వారా దిగు ప్రాంతానికి వెళ్లడం జరిగిందన్నారు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచవలసి ఉందని ఆ దిశగా నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వ నాయకులు డ్రైనేజీ వ్యవస్థ పై దృష్టి సారించ లేదని అందుమూలంగా డ్రైనేజీ వ్యవస్థ కుంటుపడి చిన్నపాటి వర్షానికే వీధులు జలమయం అయ్యేవి అన్నారు. గత నెల రోజులుగా ఆరోగ్యశాఖ, నగర పాలక సంస్థ అధికారులు సమన్వయంతో ప్రజల ఆరోగ్య దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా శానిటేషన్, డ్రైనేజీ ప్రక్షాళన వంటి కార్యక్రమాలు చేపట్టటం వలన ఈరోజు వర్షం నీరు వచ్చిన నిలువు లేకుండా డ్రైనేజీ ద్వారా పారుదలయ్యాయి అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా వర్షం పడుతున్నప్పటికీ నేడు 22వ వార్డులో వర్షాన్ని కూడా లెక్క చెయ్యకుండా అధికారులతో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా రేపు మంగళవారం ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించి సీజనల్ వ్యాధులు, డయేరియా ప్రబలకుండా నిర్మూలించే దిశగా పటిష్టమైన ప్రణాళిక ద్వారా కార్యాచరణ అమలు చేయడం జరుగుతుందని శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యాళ్ల ప్రదీప్, శెట్టి జగదీష్, మటూరి సిద్దు, నారాయణరావు, రాజేష్, రాజా, నల్లం ఆనంద్, పింకేష్, అజిత్, బృంగిమల, నారాయణ, దాసరి రమేష్, ఫైండ రవి నగర పాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.