ముఖ్య సమాచారం
-
దిల్లీ-ఆగ్రా ఎక్స్ప్రెస్ రహదారిపై బస్సుల్లో మంటలు.. 13కు పెరిగిన మృతులు
-
ఏపీలో ఆరు జోన్లు, రెండు మల్టీ జోన్లు
-
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ ప్రెస్ హైవేపై ప్రమాదం..
-
ఉద్యోగం చేసే వ్యక్తి రాజీనామా చేస్తే అతను(ఆమే) పెన్షన్ కు అనర్హులు... సుప్రీంకోర్టు కీలక తీర్పు...
-
600 బిలియన్ డాలర్ల సంపదతో ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర
-
TTD: పరకామణిలో యంత్రాలు, ఏఐ వాడండి.. టీటీడీకి హైకోర్టు కీలక సూచన
-
కొత్తగా నిర్మించే ప్రభుత్వ వైద్య కళాశాలల మీద యాజమాన్యం, పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే : ముఖ్యమంత్రి చంద్రబాబు
-
చిలకలూరిపేటలో తనిఖీ భయంతో స్వర్ణకారులు షాపులు మూసేశారు
-
పరకామణిలో జరిగిన నేరం, దొంగతనం కన్నా మించినది : ఏపీ హైకోర్టు
-
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందిన 5,757 మంది కానిస్టేబుళ్లకు ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ కార్యక్రమం
విద్యార్థులకు పోషకమైన భోజనం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం: వనమాడి మోహన్ వర్మ
Updated on: 2024-07-19 16:57:00
మధ్యాహ్న భోజన పథకం ఏర్పాట్లను పరిశీలించిన వనమాడి మోహన్ వర్మ మల్లిపూడి వీరు కాకినాడ నగర పరిధిలో మున్సిపల్ స్కూల్స్ నందు విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన సదుపాయాలను కాకినాడ జిల్లా ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షులు వనమాడి మోహన వర్మ గారు నగర అధ్యక్షులు మల్లిపూడి వీరుతో కలిసి ఎన్టీఆర్ నగర్ నందు సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ స్కూల్ మరియు అన్నంఘటి సెంటర్ నందు బాలయోగి మున్సిపల్ హైస్కూల్ నందు పరిశీలించి భోజన సదుపాయాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వనమాడి మోహన్ వర్మ, మల్లిపూడి వీరు మాట్లాడుతూ పాఠశాల హాజరును మెరుగుపరచడం, తరగతి గది ఆకలిని తగ్గించడం, విద్యార్థుల ఆరోగ్యం మరియు పౌష్షకాహారాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వ స్కూల్స్ నందు విద్యార్థులకు పోషకమైన భోజనం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పౌషక ఆహార మెనూ పై విద్యార్థులను అడిగి తెలుసుకోగా విద్యార్థులు సంతృప్తిని వ్యక్తం చేశారు.