ముఖ్య సమాచారం
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
-
ఏపీ ఎడ్సెట్.. రేపే లాస్ట్ డేట్
-
శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. 4 గురు కూలీలు మృతి
-
ప్రయాణికులకు అలర్ట్.. ఆరు ప్రధాన నగరాలకు విమానాలు రద్దు..!
జన సైనికులకు అన్ని విధాలుగా అండగా ఉంటా: సామినేని ఉదయభాను
Updated on: 2025-01-22 06:09:00

విజయవాడ ప్రవేట్ హాస్పటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న గూడూరు కి చెందిన సంతోషాన్ని జనసేన కార్యకర్తని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను గారు జనసేన పార్టీ నాయకులతో కలిసి పరామర్శించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి భరోసానిచ్చారు. ఈ సంధర్భంగా ఉదయభాను గారు మాట్లాడుతూ పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సంతోష్ కి అండగా ఉంటామని స్పష్టం చేశారు డాక్టర్లని అడిగి ట్రీట్మెంట్ యొక్క వివరాలను స్వయంగా తెలుసుకున్నారు. జనసేన పార్టీ తరఫున ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి కార్యకర్తకి తాను ప్రత్యేకంగా అందుబాటులో ఉంటానని ఉదయభాను స్పష్టం చేశారు ఎటువంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకువస్తే పరిష్కార దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సెంట్రల్ జోన్ ఆంధ్ర కన్వీనర్ బాడిత శంకర్, పార్టీ అధికార ప్రతినిధి రావి సౌజన్య, విజయవాడ జనసేన పార్టీ సీనియర్ నాయకులు గాదిరెడ్డి అమ్ములు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.