ముఖ్య సమాచారం
-
తగ్గిన బంగారం ధరలు
-
32 ఎయిర్పోర్టుల నుంచి రాకపోకలు ప్రారంభం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రణాళికతో ముందుకు వెళ్దాము - ఎమ్మెల్యే గళ్ళా మాధవి
Updated on: 2025-02-13 18:40:00

గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో పట్టభద్రుల ఎన్నికలకు ప్రణాళికతో ముందుకు వెళదామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పార్టీ నేతలను కోరారు. గురువారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో పరిశీలకులు సింహాద్రి కనకాచారి, కోవెలమూడి రవీంద్రలతో కలిసి కార్పొరేటర్లు, క్లస్టర్, డివిజన్ అధ్యక్షులతో ఎమ్మెల్యే గళ్ళా మాధవి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్సి ఓట్లు అత్యధికముగా ఉన్నాయని, వారందరినీ డోర్ టూ డోర్ కలిసి ప్రచారం చేయటంతో పాటు, ఓటు ఎలా వేయాలన్న దాని మీద అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రంలోని మంచి పాలనకు తోడ్పాటునందించాలని కోరుతూ ఓట్లు అభ్యర్ధించాలని సూచించారు. గత ప్రభుత్వం దెబ్బకు రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయిందని, దీనిని అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళే సత్తా ఎన్డీయే కూటమికి ఉందని, శాసనసభకు అత్యధిక సీట్లు గెలిపించిన మాదిరిగానే, శాసనమండలి అభ్యర్దులను గెలిపించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ముత్తినేని రాజేష్, వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్, ఈరంటి వర ప్రసాద్, కొమ్మినేని కోటేశ్వరరావు, ఆడక పద్మావతి, శ్రీవల్లి, మానం శ్రీనివాస్,సుఖవాసి శ్రీనివాస్ రావు, కసుకుర్తి హనుమంతరావు, రావిపాటి సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.