ముఖ్య సమాచారం
-
శ్రీవారి బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం.
-
భారత్ దాడి.. 11 మంది పాక్ సైనికులు మృతి
-
వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్.. అయినా బయటకు రావడం కష్టమే
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
పేట మెడికల్ షాపుల పై ఆపరేషన్ గరుడ...
Updated on: 2025-03-22 08:24:00

అనుమతులు లేని ఔషధాల నిల్వలను భారీగా గుర్తించిన అధికారులు...
దాడుల్లో పాల్గొన్న ఈగల్ టీం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, డ్రగ్ అధికారులు...
నరసరావుపేట: జిల్లా కేంద్రం నరసరావుపేటలో మెడికల్ షాపులు, ఏజెన్సీలపై శుక్రవారం ఈగల్ టీం ఐజి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మరియు పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు ఆపరేషన్ గరుడలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ దుర్వినియోగంపై దాడులు నిర్వహించారు. పట్టణంలోని పల్నాడు రోడ్డులోని మెడికల్ షాపులు, బరంపేటలో గల భవ్య శ్రీ మెడికల్ ఏజెన్సీలలో తనిఖీలు చేపట్టారు. భవ్య శ్రీ మెడికల్ గోడౌన్ లో అనుమతులు లేకుండా భారీ స్థాయిలో ఔషధాలు నిల్వ ఉంచినట్లు విజిలెన్స్ బృందం గుర్తించి పెద్ద మొత్తంలో మందులు సీజ్ చేసినట్లు ప్రాథమికంగా తెలిపారు. నరసరావుపేట రూరల్ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ దాడుల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్లు మంగమ్మ, పద్మ, విజిలెన్స్ ఏఈ శివన్నారాయణ, ఎఫ్ఆర్ఓ సైదులు, విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.