ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
నేడు ఏపీ సీఐడీ అధికారుల ముందు హాజరవనున్న ఆ ఇద్దరు మాజీ పోలీస్ ఉన్నతాధికారులు
Updated on: 2025-05-05 13:56:00
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నటి కాదంబరి జత్వానీ కేసులో ఇద్దరు మాజీ పోలీస్ ఉన్నతాధికారులు ఈరోజు సీఐడీ అధికారుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు.ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐపీఎస్ అధికారులు కాంతిరాణా తాతా, విశాల్ గున్నీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, వారికి ముందస్తు బెయిల్ లభించింది. దీంతో వారు అరెస్టు నుంచి ఉపశమనం పొందారు. అయితే ఈ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి, గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన పీఎస్ఆర్ ఆంజనేయులును సీఐడీ అధికారులు అరెస్టు చేయగా, ప్రస్తుతం ఆయన విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
తాజాగా ఈ కేసులో విశాల్ గున్నీ, కాంతిరాణా తాతాలకు విచారణ నిమిత్తం హాజరుకావాలని సీఐడీ నోటీసులు జారీ చేయగా, వారు ఈరోజు (సోమవారం) విజయవాడ సీఐడీ కార్యాలయంలో అధికారుల ముందు హాజరయ్యే అవకాశం ఉంది.