ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
Updated on: 2025-12-10 08:43:00
బ్రహ్మ కమలం పుష్పాలు అరుదుగా కనిపిస్తుంటాయి. ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ పుష్పాలు పూస్తుంటాయి. బ్రహ్మ కమలం పుష్పానికి హిందూ సంప్రదాయంలో చాలా విశిష్టత ఉంది. హిమాలయాల్లో దొరికే ఈ అరుదైన మొక్కను చాలా తక్కువ మంది మాత్రమే పెంచుతుంటారు. అలాగే ఈ మొక్క ఇంట్లో ఉంటే ఎంతో మంచిదని అందరూ భావిస్తుంటారు. అద్భుతమైన వాసనతో ఉండే బ్రహ్మ కమలం అర్థరాత్రి సమయంలో వికసించి కొన్ని గంటలు మాత్రమే ఉండి వాడిపోతాయి. మామూలుగా బ్రహ్మకమలం ఒకటి పూస్తేనే జనం అద్భుతంగా చూస్తుంటారు. కానీ బొబ్బిలి పట్టణం పూల్ బాగ్ లో నివసిస్తున్న ఏ .లక్ష్మణరావు (విశ్రాంత ఉపాధ్యాయులు) ఇంట్లో పూసిన బ్రహ్మ కమలం పుష్పాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఒక మొక్క నుంచి ఏకంగా 34 పుష్పాలు విరబూశాయి. లక్ష్మణరావు సంవత్సరం క్రితం ఇతర ప్రాంతం నుంచి ఈ మొక్కను తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఈ మొక్క నుండి సుమారు 100పైగా బ్రహ్మ కమలం పుష్పాలు విరబూశాయి. చెట్టు నిండా పూసిన పూలు ఆకాశంలో నక్షత్రాలను తలపిస్తున్నాయి. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల జనం తరలివస్తున్నారు. వందకుపైగా పూసిన బ్రహ్మ కమలం పుష్పాలను ఇంటి యజమాని వేంకటేశ్వర స్వామి పూజకు ఉపయోగించారు.