ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
Updated on: 2025-12-10 19:35:00
బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం.. గ్రీన్ బెల్ట్ సొసైటీ అధ్యక్షులు ఎస్వీ రమణమూర్తి ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు, మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ మురళి కి, బొబ్బిలి మునిసిపాలిటీకి స్వచ్ఛ మున్సిపాలిటీగా అవార్డు పొందిన సందర్భంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ కె.వి అప్పారావు మాట్లాడుతూ బొబ్బిలి మున్సిపాలిటీ పనితీరును మెచ్చుకున్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికై ఎటువంటి సహాయ సహకారాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అనంతరం కమిషనర్ రామలక్ష్మి మాట్లాడుతూ గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు చేస్తున్న పలు కార్యక్రమాలను అభినందించారు. మున్సిపల్ చైర్ పర్సన్ శరత్ బాబు మాట్లాడుతూ మీ అందరి సహాయ సహకారాలతో బొబ్బిలి మున్సిపాలిటీ అభివృద్ధి పరిచేందుకు, ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ సురేష్, డి ఈ కిరణ్ కుమార్, మున్సిపల్ మేనేజర్, ఏఈ గుప్తా, రెవెన్యూ అధికారి నాగరాజు, బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు రేవళ్ళ కిరణకుమార్, భోగి ఈశ్వరరావు గ్రీన్ బెల్ట్ సభ్యులు ఏ లక్ష్మణరావు, చప్ప బాల భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.