ముఖ్య సమాచారం
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్‌లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
-
ఏపీ ఎడ్‌సెట్.. రేపే లాస్ట్ డేట్
-
శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. 4 గురు కూలీలు మృతి
-
ప్రయాణికులకు అలర్ట్.. ఆరు ప్రధాన నగరాలకు విమానాలు రద్దు..!
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
Updated on: 2025-05-13 11:41:00

సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంలో మిధున్ రెడ్డి పిటీషన్ వేశారు. ఈ పిటిషన్‌ను మంగళవారం నాడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టునే ఆశ్రయించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. అప్పటికే మద్యం కేసులో మిధున్ రెడ్డిని నిందితుడిగా చేర్చకపోవడం, అరెస్ట్ చేసే ఉద్దేశం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన క్రమంలో ముందస్తు బెయిల్ పిటీషన్‌ను హైకోర్టు కోట్టివేసిన విషయం తెలిసిందే
ప్రస్తుతం మిధున్ రెడ్డిని నిందితుడిగా చేర్చిన నేపథ్యంలో మెరిట్స్ ఆధారంగా మళ్లీ తాజాగా వాదనలు విని ముందస్తు బెయిల్‌పై నిర్ణయాన్ని వెల్లడించాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. గతంలో మిధున్‌రెడ్డికి ఇచ్చిన మధ్యంతర రక్షణను కూడా సుప్రీంకోర్టు తొలగించింది. విచారణ సంస్థ చూపిన కొత్త ఆధారాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకొని మిధున్‌రెడ్డి బెయిల్‌పై నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.