ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
ఇరాన్ పై భారీ ఆపరేషన్ కు అమెరికా సై?
Updated on: 2025-06-17 16:42:00
ఇరాన్ అణు కార్యక్రమాన్ని దెబ్బతీయడానికి అమెరికా తన అమ్ములపొదిలోని అత్యంత శక్తిమంతమైన జీబీయూ-57 'బంకర్ బస్టర్' బాంబులను ప్రయోగించవచ్చనే వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి.
ఇరాన్ తన అణు కేంద్రాలను, ముఖ్యంగా ఫార్దో వంటి కీలక సదుపాయాలను పర్వతాల లోపల, భూగర్భంలో అత్యంత పటిష్టంగా నిర్మించుకుంది. వీటిని ధ్వంసం చేయాలంటే సాధారణ బాంబులు సరిపోవు. అందుకే, దాదాపు 13,600 కిలోల బరువుండే జీబీయూ-57 మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ (MOP) బాంబులను అమెరికా ప్రయోగించవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ భారీ బాంబులు కాంక్రీట్ బంకర్లను ఛేదించుకుని లోపలికి చొచ్చుకుపోయి విధ్వంసం సృష్టించగలవు. వీటిని మోసుకెళ్లగల సామర్థ్యం బి-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లకు మాత్రమే ఉంది. ట్రంప్ చర్యలు..
యుద్ధ సంకేతాలా?
జీ7 భేటీని హఠాత్తుగా ముగించుకుని వాషింగ్టన్కు పయనమవడం, శ్వేతసౌధంలో 'సిచ్యుయేషన్ రూమ్'ను సిద్ధం చేయించడం వంటి ట్రంప్ చర్యలు ఇరాన్‌పై సైనిక చర్యకు రంగం సిద్ధమవుతోందన్న వాదనలకు ఊతమిస్తున్నాయి. "టెహ్రాన్ ప్రజలు నగరాన్ని వీడండి" అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతలను మరింత పెంచాయి. ఇరాన్‌కు అణ్వాయుధం దక్కనివ్వబోమని ఆయన పునరుద్ఘాటించడం గమనార్హం.