ముఖ్య సమాచారం
-
దిల్లీ-ఆగ్రా ఎక్స్ప్రెస్ రహదారిపై బస్సుల్లో మంటలు.. 13కు పెరిగిన మృతులు
-
ఏపీలో ఆరు జోన్లు, రెండు మల్టీ జోన్లు
-
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ ప్రెస్ హైవేపై ప్రమాదం..
-
ఉద్యోగం చేసే వ్యక్తి రాజీనామా చేస్తే అతను(ఆమే) పెన్షన్ కు అనర్హులు... సుప్రీంకోర్టు కీలక తీర్పు...
-
600 బిలియన్ డాలర్ల సంపదతో ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర
-
TTD: పరకామణిలో యంత్రాలు, ఏఐ వాడండి.. టీటీడీకి హైకోర్టు కీలక సూచన
-
కొత్తగా నిర్మించే ప్రభుత్వ వైద్య కళాశాలల మీద యాజమాన్యం, పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే : ముఖ్యమంత్రి చంద్రబాబు
-
చిలకలూరిపేటలో తనిఖీ భయంతో స్వర్ణకారులు షాపులు మూసేశారు
-
పరకామణిలో జరిగిన నేరం, దొంగతనం కన్నా మించినది : ఏపీ హైకోర్టు
-
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందిన 5,757 మంది కానిస్టేబుళ్లకు ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ కార్యక్రమం
నాలుగో రోజుకు చేరుకున్న గణపతి నవరాత్ర మహోత్సవాలు... శ్రీ వీర గణపతిగా దర్శనమిచ్చిన స్వామివారు
Updated on: 2025-08-30 09:32:00
గుడివాడ పట్టణంలో ప్రాముఖ్యత కలిగిన మెయిన్ రోడ్డులోని శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో గణపతి నవరాత్ర మహోత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. శనివారం శ్రీ వీర గణపతి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారికి వేద పండితులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా శివ జ్యోతి నృత్యాలయం కళాకారులు నిర్వహించిన కూచిపూడి, జానపద నృత్య ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. కళాకారులకు దేవస్థానం చైర్మన్ సాయన రాజేష్, ఈవో యార్లగడ్డ వాసు దేవదాయ శాఖ సర్టిఫికెట్లను అందించారు.
ఉత్సవాల ఐదో రోజు ఆదివారం శ్రీ పంచముఖ అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారని కమిటీ చైర్మన్ సాయన రాజేష్, ఈవో యార్లగడ్డ వాసు తెలియజేశారు. ప్రతిరోజు సాయంత్రం వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.