ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
రైతుల ఖాతాల్లోనే నేరుగా.. క్వింటాల్ కు రూ.8,110..
Updated on: 2025-09-27 18:02:00
TG:
పొడవు పింజ పత్తికి క్వింటాలుకు 8,110 రూపాయలు, మధ్య పింజ పత్తికి క్వింటాల్ కు 7,710 రూపాయలు మద్దతు ధర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం రైతాంగ సంక్షేమం కోసం అన్నదాత సుఖీభవ వంటి పథకాలను అమలు చేయడమే కాకుండా రైతులకు మద్దతు ధర కల్పించడం పైన కూడా ఫోకస్ చేస్తుంది.
ఈసారి పత్తి రైతులకు 2025- 26 సంవత్సరంలో ఈ సీజన్ కోసం పొడవు పింజ పత్తికి క్వింటాలుకు 8,110 రూపాయలు, మధ్య పింజ పత్తికి క్వింటాల్ కు 7,710రూపాయలు మద్దతు ధరగా నిర్ణయించింది. పత్తి కొనుగోళ్ల తర్వాత ఈ మొత్తం రైతుల బ్యాంకు ఖాతాలలోకి నేరుగా జమ అవుతుందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
స్లాట్ బుక్ చేసుకుని సీసీఐకి పత్తి విక్రయాలు
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రకటించిన మద్దతు ధరలకు రైతులు తమ పంటను విక్రయించాలి అనుకుంటే 'కాపాస్ కిసాన్ యాప్' ద్వారా ముందస్తుగా నమోదు చేసుకోవాలి. యాప్ లో స్లాట్ బుకింగ్ సదుపాయం ఉండటంతో, రైతులు తమకు అనుకూలమైన స్లాట్ బుక్ చేసుకుని సులభంగా పంటలను అమ్ముకోవచ్చు. ఈ సంవత్సరం రాష్ట్రంలో సుమారు 4.02 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేశారు.
సీసీఐ ద్వారా పత్తి అమ్మాలంటే నమోదు తప్పనిసరి
పత్తి సాగు ద్వారా 7.12లక్షల టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. ఈ పత్తిని స్టోర్ చేసుకోవడానికి రైతులకోసం మార్కెట్ యార్డులు, జిన్నింగ్ మిల్లులలో అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించారు అధికారులు. అయితే పత్తికి కేంద్రం ప్రకటించిన మద్దతు ధర పొందాలంటే రైతులు రైతు సేవా కేంద్రాలలో నమోదు చేసుకోవాలి. పంట అమ్మకాల కోసం ఆధార్ కార్డు, పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ తప్పనిసరిగా ఇచ్చి నమోదు చేసుకోవాలి.
నేరుగా రైతుల ఖాతాలలోకే డబ్బులు
ఇక పత్తి పంట సాగు చేస్తున్న రైతులను గ్రామ వ్యవసాయ సహాయకులు ఆధార్ ఆధారిత ఈ పంట డేటా ద్వారా గుర్తిస్తారు. ఎవరైతే సిసిఐ ద్వారా అమ్ముకోవడానికి నమోదు చేసుకుంటారో వారికి బీమా సదుపాయం కూడా అందుబాటులోకి వస్తుంది. cci పత్తిని కొనుగోలు చేసిన తర్వాత రైతుల బ్యాంకు ఖాతాలోకి డబ్బులను చెల్లింపు చేస్తుంది. రవాణా వివరాలను యాప్లో నమోదు చేస్తే రవాణా దారులకు డబ్బులు నేరుగా బదిలీ చేస్తుంది.