ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
పాక్‌తో భారత్ టైటిల్ ఫైట్
Updated on: 2025-09-28 07:46:00
'పాకిస్థాన్ మాకు పోటీయే కాదు..' అని భారత కెప్టెన్ సూర్యకుమార్ ధీమాగా చెప్పాడు.
అయినా.. యుద్ధభూమిలోనే కాదు, క్రికెట్ మైదానంలోనూ ఆ జట్టును చిత్తుగా ఓడిస్తే తనివితీరా చూసి ఆనందించాలన్నది అభిమానుల ఆకాంక్ష. అందుకే పాక్‌తో ఆడే ప్రతీ మ్యాచ్‌నూ వారు భావోద్వేగంతో తిలకిస్తుంటారు. పైగా ఈసారి కరచాలన వివాదం, రెచ్చగొట్టే చేష్టల వ్యవహారం సరేసరి..
ఈ నేపథ్యంలో ఆదివారం ఇరు జట్ల మధ్యే ఆఖరి సమరం జరుగబోతోంది. ఈ కీలక మ్యాచ్‌లోనూ 'ఫైనల్' పంచ్ తమదే అవ్వాలని టీమిండియా భావిస్తోంది. అటు గతమెలా ఉన్నా ఈసారి మాత్రం ప్రత్యర్థికి చాన్స్ ఇవ్వకూడదని పాక్ కసితో ఉంది
దుబాయ్: దాదాపు ఏకపక్ష మ్యాచ్‌లతో.. అక్కడక్కడా ఉత్కంఠభరిత క్షణాలతో సాగిన ఆసియాకప్ ఆఖరి అంకానికి చేరుకుంది. 41 ఏళ్ల టోర్నీ చరిత్రలో భారత్-పాక్ జట్లు తొలిసారి ఫైనల్లో తలపడబోతున్నాయి. దీంతో ఆదివారం జరిగే ఈ హైవోల్టేజి సమరంపై ఆసక్తి రెట్టింపయ్యింది. టోర్నీలో భారత్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఓటమనేదే లేకుండా తుది పోరుకు అర్హత సాధించగా, అటు పాక్ ఓడిన రెండు మ్యాచ్‌లు భారత్‌పైనే కావడం గమనార్హం. ఏదిఏమైనా ఆపరేషన్ సింధూర్ ప్రభావం ఈ ఆసియాక్‌పపై గట్టిగానే పడిందని చెప్పవచ్చు. కరచాలనం నిరాకరణతో పాటు గ్రూప్ మ్యాచ్‌లో పాక్‌ను ఓడించాక కెప్టెన్ సూర్య తమ విజయాన్ని సైనికులకు అంకితమిచ్చాడు. దీనికి ప్రతిగా అన్నట్టు సూపర్-4 మ్యాచ్‌లో ఫర్హాన్ గన్‌ఫైర్ సంబరాలు, రౌఫ్ 6-0 సంకేతాలు భారత అభిమానుల భావోద్వేగాలను రెచ్చగొట్టినట్టయ్యింది. ఇరు బోర్డుల పరస్పర ఫిర్యాదులతో ఐసీసీ జరిమానాలు కూడా విధించింది. వ్యవహారం ఇంతవరకూ వచ్చాక ఫైనల్లో ఆ ప్రభావం ఎలా ఉండబోతున్నదనే సందేహం అందరిలో నెలకొంది. ఓవరాల్‌గా టీ20ల్లో ఆడిన 15 మ్యాచ్‌ల్లో భారత్ 11-3తో పాక్‌పై స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఓ మ్యాచ్ టైగా ముగిసింది. అదే ఆసియాకప్‌లో ఆడిన ఐదు టీ20 మ్యాచ్‌ల్లోనూ 4-1తో భారత్‌దే పైచేయి.