ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
మాజీ సైనికులకు తెల్ల రేషన్ కార్డు స్థానంలో ప్రత్యేకంగా వెటరన్ కార్డు ఐవ్వాలి
Updated on: 2025-09-28 14:56:00
బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం గౌరవ అధ్యక్షులు మరడరామినాయుడు ఆధ్వర్యంలో అధ్యక్షులు రేవళ్ల కిరణ్ కుమార్ పర్యవేక్షణలో బొబ్బిలి పాత కోటలో గల సంఘము కార్యాలయంలో ఆదివారం నిర్వహించబడినది. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు మాజీ సైనికుల కుద్దేశించి మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మాజీ సైనికుడు ఎన్ పాపారావు మాట్లాడుతూ మాజీ సైనికులకు పెన్షన్ అందుతుందనే కారణం గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమ పథకాలు లభించడం లేదని, ప్రభుత్వ ఉద్యోగులను ...మాజీ సైనికులను ఒకేలా చూడడం సరికాదని.. మాజీ సైనికుల కోసం ప్రత్యేక వేటరన్ కార్డును ...తెల్ల రేషన్ కార్డు స్థానంలో ఇప్పించాలని ఈ విషయముపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని తెలిపారు. దీనికి ఆయన స్పందించి, జిల్లా సైనిక అధికారీతో సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఏ గోవింద నాయుడు, జాయింట్ కార్యదర్శి ఎస్ ఆర్ మోహన్ రావు, కోశాధికారి వీయన్ శర్మ, తదితర సభ్యులు పాల్గొన్నారు.